NTV Telugu Site icon

Kottu Satyanarayana: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం.. గందరగోళం సృష్టించాలని ప్లాన్‌..!

Kottu

Kottu

Kottu Satyanarayana: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై పెద్ద రచ్చే జరుగుతోంది.. విపక్షాలు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను తప్పుబడుతుండగా.. అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాక్ట్‌పై కూటమిలోని బీజేపీ ఏం చెబుతుంది? ప్రధాని నరేంద్ర మోడీతో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రకటన చేయించాలని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.. ఇక, ఈ రోజు కర్నూలులో జరిగిన ప్రజాగళం సభలో భూ హక్కు పత్రాన్ని తగలబెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమల్లోకి వస్తే ప్రజలు తమ ఆస్తులపై హక్కు కోల్పోతారని ఆరోపించిన ఆయన.. మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ కూడా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ బాధితుడే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం అంటూ వ్యాఖ్యానించారు.

Read Also: Pushkar Singh Dhami: కారు కార్ఖానాలోకి పోయింది.. చేతి పని అయిపోయింది..

అయితే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబుది అనవసర రాద్ధాంతం అంటూ కొట్టిపారేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న ఆయన.. ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించి గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే నారా చంద్రబాబు నాయుడు.. కనీస జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రజలు ఎలాంటి అపోహలకు పడాల్సిన అవసరం లేదు.. ఎవరి భూములకు ఎలాంటి భయం లేదన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

Show comments