Site icon NTV Telugu

Konda Surekha: ఆరు హామీలపై మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన

Konda Surekha

Konda Surekha

Konda Surekha: తొమ్మిదేండ్ల అహంకార పాలనకు చరమ గీతం పాడింది కాంగ్రెస్ కార్యకర్తలేనని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. తుక్కుగూడ ‘జనజాతర’ సభలో ఆమె ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్న ఆమె.. ఆరు హామీలపై కీలక ప్రకటన చేశారు. ఆరు హామీలు ఎన్నికలు ముగియగానే అమలులోకి వస్తాయని తెలిపారు. కేటీఆర్, కేసీఆర్.. ప్రస్టేషన్‌లో ఉన్నారని.. అధికారం పోయిందని బాధ ఒక వైపు.. పార్టీ ఖాళీ అవుతుందనే బాధ ఇంకో వైపు ఉందని.. ఆ బాధతోనే మాట్లాడుతున్నారని ఆమె వెల్లడించారు. కుక్కల కొడుకుల్లారా అని కేసీఆర్‌ అంటున్నారని.. మహిళలను దూషిస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేటీఆర్ మీద మాట్లాడితే తనకు ఒక్క నోటీసు ఇచ్చాడని.. కేసీఆర్ తిట్లకు ఎంత మంది వీలైతే అన్ని నోటీసులు పంపాలన్నారు. బీఆర్‌ఎస్ వాళ్లు చవటలు, చేతకాని దద్దమ్మలు అంటూ ఆమె విమర్శించారు.

Read Also: PM Modi: కాంగ్రెస్ మేనిఫేస్టోలో “ముస్లిం లీగ్” ఆలోచనలు.. దేశాన్ని విడగొట్టే యత్నం..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామని మంత్రి సీతక్క ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో 14 సీట్లు గెలిపిద్దామని అన్నారు. ఉద్యోగాలు అడిగితే రామాలయం చూపెడుతున్నారని.. బీజేపీ వాళ్ళు ఇల్లు ఇచ్చారా.. 15 లక్షలు ఇచ్చారా అని ప్రశ్నించాలన్నారు. మోడీ పాలన చెప్తే భారతం అంత.. రాస్తే రామాయణం అంతా అంటూ ఎద్దేవా చేశారు. మోడీ గిరిజనుల హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు. 30 రోజులు మీరు కష్టపడాలని.. ఐదేళ్లు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.

 

Exit mobile version