Konda Surekha: మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన వన్యప్రాణి సంరక్షణ బోర్డు సమావేశం నేడు (మే 13)న జరిగింది. అడవుల్లో అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ, వన్యప్రాణి సంరక్షణ చర్యలపై రాష్ట్ర అటవీ, పర్యారణ, దేవాదాయ శాఖ మంత్రి సంబంధిత ఉన్నతాధికారుల సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలోని వివధ జోన్ల సీసీఎఫ్ లు, అన్ని జిల్లాల డీఎఫ్ఓలతో స్టేట్ పీసీసీఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) డాక్టర్ సువర్ణతో కలసి మంత్రి సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే తెలంగాణ రాష్టవ్యాప్తంగా ఉన్న అడవుల్లో అగ్ని ప్రమాదం నివారణకు ఏం పరికరాలు వాడుతున్నారని అధికారులను ఆరా తీశారు మంత్రి సురేఖ. ఇంకా ఎక్కడైన ఒకేసారి పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయా? లేదా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Read Also: iQOO Neo10 Pro+: 7000mAh బ్యాటరీ, 2K OLED డిస్‌ప్లేతో విడుదలకాబోతున్న iQOO నియో10 ప్రో+..!
మరోవైపు, ఏ జిల్లాలో ఎక్కువ అగ్నిప్రమాదాలున్నాయి..? వాటి వల్ల వన్యప్రాణులు ఇబ్బందులు పడకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని మంత్రి సురేఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, వైల్డ్ లైఫ్ బోర్డు ఉన్నతాధికారులు అందుకు సంబంధించిన వివరాలను మంత్రికి తెలిపారు. వేసవి దృష్ట్యా అడవుల్లో, జూ లలో వన్యప్రాణుల, ఇతర జంతవులకు తగిన తాగునీటి సదుపాయాల కల్పన విషయాలపై ఆరా తీశారు మంత్రి.
అయితే, ఈ వేసవిలో జంతువుల కోసం 2168 నీటి గుంతలు ఏర్పాటు చేసినట్టు మంత్రికి అధికారులు వివరించారు. నీటి గుంతల్లోకి నీటిని ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా ఎప్పటికప్పుడు తీసుకువస్తున్నట్టు అధికారులు తెలిపారు. నెహ్రూ జూ పార్కు, వరంగల్ జూ పార్కులలో ప్రత్యేక ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. వన్యప్రాణులకు నీరు, ఆహారం విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించద్దని మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేసారు. ప్రత్యేకంగా నీటి లభ్యత ఉన్న ఆహార పదార్థాలు, పండ్లను (దోసకాయ, పుచ్చకాయ వంటి) వాటికి ఆహారం అందజేయాలని మంత్రి సూచించారు.