Minister Komatireddy Venkat Reddy: కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తామన్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వచ్చే మూడేళ్లలో ప్రతీ ఊరికి బీటీ రోడ్, మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారి విస్తరణ చేస్తామన్నారు. ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నుంచే ప్రజా ప్రభుత్వం పడిపోతుందని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సంక్రాంతికి ఎకరాకు 7 వేల చొప్పున రైతు భరోసా వేస్తామని చెప్పారు.
Read Also: Minister Sridhar Babu: మూసీ ప్రక్షాళనకు ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ణానం
నిజామాబాద్ జిల్లా రాంరెడ్డి గార్డెన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ దీక్ష గురించి మంత్రి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ది నకిలీ దీక్ష అంటూ వ్యాఖ్యలు చేశారు. బూస్ట్ తాగుతూ, సెలైన్లు, విటమిన్స్ తింటూ దీక్ష చేసి పెద్ద త్యాగం చేసినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారన్నారు. కానిస్టేబుల్ కిష్టయ్యది, శ్రీకాంతాచారిది నిజమైన త్యాగమన్నారు. తెలంగాణ ఏర్పాటు సోనియా గాంధీ నిర్ణయంతో జరిగిందన్నారు.