ఉప్పల్-నారపల్లి నిలిచిపోయిన నూతన ఫ్లై ఓవర్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు. 2018లో ప్రారంభమై నేటికి ఫ్లై ఓవర్ పనులు పూర్తికాలేదు. ఐదేళ్ళైనా ఫ్లై ఓవర్ పూర్తి కాకపోవడం కారణాలపై నేషనల్ హైవే అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షించారు. పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య సమన్వయ లోపంతో పనులు నిలిచిపోయాయి. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఫ్లై ఓవర్ పనులు పూర్తిచేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవలే కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. 2018లో 600 కోట్లతో ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించారు. నిధుల లేమితో నిలిచిపోయిన 7.2 కిలోమీటర్ల పొడవు ఉన్న ఫ్లైఓవర్..
Bangladesh clashes: బంగ్లాదేశ్ ఘర్షణల్లో 32 మంది మృతి.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..
ఈ సందర్భంగావారం రోజుల్లో కొత్త టెండర్లకు ఏర్పాటు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. 2018 నుండి నేటి వరకు పనులు పూర్తి కాకపోవడం గత రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరం అని అన్నారు. మూసీ తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి ఈ హైవేలో ఫ్లైఓవర్ పూర్తిగాకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో గుంతలో పడి అనేక మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయని.. వెంటనే ఆర్&బీ అధికారులతో కలిసి రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, తనకు ఎస్టిమేషన్ నివేదిక అందజేయాలని మంత్రి ఆదేశం ఇచ్చారు. ఆరు సంవత్సరాల నుంచి పనులు పూర్తికాకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.
IND vs SL: రెండో వన్డేలో భారత్ టార్గెట్ ఎంతంటే..?
అధికారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. 15 రోజులలో కల్వర్టు పనులు పూర్తి చేయాలి.. అధికారుల నిర్లక్ష్యం తోటి ప్లై ఓవర్ పూర్తి కాలేదని మంత్రి తెలిపారు. కాంట్రాక్టర్ల మీద పెట్టి తప్పించుకోవద్దు.. వారి తప్పిదం వల్ల ప్రజలకు నష్టం జరుగొద్దని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు పూర్తి చేయకపోతే ఇన్ని సంవత్సరాలు నుంచి ఎందుకు టెర్మినేట్ చేయలేదని ప్రశ్నించారు. వేరే వాళ్లకు ఎందుకు అప్పగించలేదు.. జీహెచ్ఎంసీ, ఫారెస్ట్ అని తప్పించుకోవద్దని అన్నారు. ఈ క్రమంలో.. ఏడో తారీఖు నుండి పనులు ప్రారంభిస్తామని నేషనల్ హైవే ఆర్వో పుష్ప చెప్పారు.