Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy: నిరుద్యోగులను కేసీఆర్ ఇంటికి పంపాలా.. కేటీఆర్ ఇంటికి పంపాలా..?

Komatireddy

Komatireddy

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.. చావు తప్పి కన్ను లొట్ట పోయి గెలిచాడు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని అసమర్థ నాయకుడు.. ముగ్గురుని హత్య చేసిన కేసులో నిందితుడు, హంతకుడు అని ఆయన ఆరోపణలు చేశాడు. రేపో మాపో జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం.. కోవర్టు అనేది తప్పుడు ఆరోపణలు చేశాడు.. ఆయన గురించి మాట్లాడటం వెస్ట్ అని మంత్రి పేర్కొన్నారు. 80 ఎకరాల ఫామ్ హౌస్ ఎలా కట్టాడు అని ప్రశ్నించారు. అలాగే, జగదీశ్వర్ రెడ్డికి సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం చుట్టూ 150 ఎకరాల భూములు వచ్చాయిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడిగారు.

Read Also: Isha Storm : విమానంలో కూర్చొని నిద్రపోయిన ప్రయాణికులు.. లేచి చూసే సరికి ఎక్కడున్నారంటే ?

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇక, 200 యూనిట్ల కరెంట్..100 రోజుల్లో ఇచ్చి.. హామీ నిలబెట్టుకుంటాం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో దళితుణ్ణి సీఎం చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఏం చేశాడు.. దళితుణ్ణి సీఎం చేయకపోతే మెడ మీద తల నరుక్కుంటా అన్నాడు.. 9 ఏండ్లు తల నరుక్కున్నాడా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దోపిడీతో.. మేము ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయలేకపోయామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా అని కేసీఆర్ ఇవ్వలేదు.. నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసింది.. పదేళ్లు వారికి ఉద్యోగాలు ఇవ్వకూండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.. ఇప్పుడు నిరుద్యోగులను కేసీఆర్ ఇంటికి పంపాలా.. కేటీఆర్ ఇంటికి పంపాలా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

Exit mobile version