Site icon NTV Telugu

Minister Komatireddy: రైతులకు గుడ్‌ న్యూస్.. వారంలోపు మిగిలిన వారందరికీ రుణమాఫీ!

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Minister Komatireddy Venkat Reddy: రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. వారంలోపు మిగిలిన వారందరికీ రైతు రుణమాఫీ పూర్తి అవుతుందని వెల్లడించారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం అర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు తరువాత 3 రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. సన్నాలను ప్రోత్సహించడానికే 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పక్క రాష్ట్రం నుండి జిల్లాలోకి ధాన్యం రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

Read Also: Traffic Challan: హెల్మెట్‌ పెట్టుకోనందుకు లక్ష చలానా.. ఎక్కడో తెలుసా?

ఉచిత విద్యుత్‌కు మొదట సోనియా గాంధీ ఒప్పుకోలేదని.. వైయస్సార్ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు చేసి… ఆ తర్వాత ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ విధానంగా మారేందుకు దోహదపడ్డారని మంత్రి కోమటి రెడ్డి గుర్తు చేశారు. తన ఉసురు, ప్రజల ఉసురు తగిలి బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిందని మంత్రి పేర్కొన్నారు.

Exit mobile version