గత ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలనను ప్రజలకు దగ్గర చేస్తున్నామన్నారు. ఇక, ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులు ఆషామాషీగా తీసుకోవద్దు.. ప్రజావాణిలో వచ్చే వినతి పత్రాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
Read Also: IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆందోళనలో బీసీసీఐ!
ఇక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం, మంత్రులు, జిల్లా కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కరెంట్ బిల్లులు కట్టోద్దు అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాటలను నమ్మొద్దు.. విద్యుత్ శాఖ అప్పుల్లో కూరుకుపోయేంది అని ఆయన ఆరోపించారు. అందులో సంస్కరణలు తీసుకువస్తున్నాం.. 200 యూనిట్ ల వరకు ఉచిత విద్యుత్ త్వరలో అమలు చేస్తాం.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై విజిలెన్స్ విచారణకు జరుగుతుంది.. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు వివాదాస్పదం కావడానికి కేసీఆర్ కారణం అని మంత్రి మండిపడ్డారు. సాగు నీటి ప్రాజెక్ట్ ల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారు.. SLBC సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఎస్టీమేషన్ భారీగా పెరిగింది.. 5 ఏళ్లలో SLBC పూర్తి చేస్తాం.. ప్రజాధనాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
