NTV Telugu Site icon

PM Modi Vizag Tour: ఈ నెల 8న ఏపీకి ప్రధాని మోడీ.. మంత్రుల కమిటీ ఏర్పాటు

Parthasarathy

Parthasarathy

PM Modi Vizag Tour: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రాబోతున్నారు.. ఈ నెల విశాఖ పర్యటన ఖరారైనట్టు జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సమాచారం అందించారు.. 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు మోడీ.. అయితే, ఈ నెల 8 తేదీన ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రుల కమిటీని నియమించారు సీఎం చంద్రబాబు నాయుడు.. కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. ఈ విషయాన్ని వెల్లడించారు.. విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు.. ఎన్టీపీసీ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.. రూ.65,370 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఎన్టీపీసీ పెడుతోంది.. 2500 ఎకరాల్లో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ జోన్ కు కూడా ప్రధాని ప్రారంభిస్తారు.. నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్క్ కు కూడా పీఎం మోడీ శంకుస్థాపన చేస్తారు.. బల్క్ డ్రగ్ పార్కులో రూ.11,542 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు పార్థసారథి..

Read Also: West Bengal: మమతా బెనర్జీ సన్నిహితుడి హత్య..

ఇక, జనవరి 8 తేదీన ప్రధాని మోడీ విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభ నుంచే ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు మంత్రి పార్థసారథి.. అంతకుముందు విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహిస్తారు.. నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకూ రోడ్ షో ఉంటుందని తెలిపారు.. మరోవైపు.. వచ్చే విద్య సంవత్సరం లోగా తల్లికి వందనం పథకం అందించేందుకు కేబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకుంది.. రైతులకు ఇచ్చే ఆర్ధిక సాయం అన్నదాతా సుఖీభవ కార్యక్రమాన్ని కేంద్రంతో పాటే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. కేంద్ర సాయంతో కలిపి రూ.20 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం.. వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్ధిక సాయం రూ.20 వేలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారని వెల్లడించారు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి..

Show comments