NTV Telugu Site icon

Kishan Reddy: విదేశీ పెట్టుబడులకు మనమే గమ్యస్థానం

Kishan Reddy1

Kishan Reddy1

విశాఖ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy). రోజ్ గార్ యోజన కింద ఉద్యోగాలు పొందిన యువతీ, యువకులకు నియామక పత్రాలు అందజేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాన మంత్రి నిర్వహిస్తున్న రోజ్ గార్ వర్చ్యువల్ మీటింగ్ లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. జీ-20దేశాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం మనకు లభించింది. ప్రపంచ స్థాయి నాయకత్వం, పెట్టుబడిదారులు మన దగ్గరకు వస్తున్నారు. ఇది మనకు మంచి అవకాశం. కొత్తగా ఉద్యోగ అవకాశాలు పొందిన యువకులు దేశం కోసం శక్తియుక్తులు ఖర్చు పెట్టాలి..కరోనా కంటే ముందు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వ్యాక్సిన్ కోసం విమానాల వైపు ఎదురు చూసే పరిస్థితి ఉండేదన్నారు.

Read Also: Multani mitti Face Beauty: అందమైన ముఖం కోసం సింపుల్ చిట్కా

కరోనాకు వ్యాక్సిన్ ను అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. భారతదేశం ఇప్పుడు పెట్టుబడులు గమ్య స్థానంగా మారింది. భారత యువకులు తమ మేథస్సుతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి యువత ఎదగాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. స్వాతంత్ర్య వచ్చిన తర్వాత ఈ 8ఏళ్ళలోనే జాతీయ రహదారుల అభివృద్ధి ఎక్కువగా జరిగిందన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి పర్యటనలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును అడ్డుకున్నారు సీఐఎస్ఎఫ్ సిబ్బంది.

శాకుంతల ఆడిటోరియంలోకి మంత్రితో కలిసి వెళ్లే సమయంలో ఘటన జరిగింది. మమ్మల్ని తోసేస్తారా….అంటూ సిఐఏస్ఎఫ్ సిబ్బందిపై సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక్కి వచ్చి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్ ను లోపలికి తీసుకుని వెళ్ళారు కిషన్ రెడ్డి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్ట్ వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు. పరవాడకు చెందిన పలువురు సిపిఎం నాయకులు గృహ నిర్భంధం చేశారు పోలీసులు.

Read Also: Students Struggle For Bus: బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు.. ఉద్రిక్తత