NTV Telugu Site icon

Karumuri Nageswara Rao: అమిత్‌షా కామెంట్లకు కారుమూరి కౌంటర్.. చెవిలో ఎవరో ఊదితే.. దాన్నే షా మాట్లాడారు..

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా విశాఖ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. వరుసగా షా వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తున్నారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. పనిలో పనిగా రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నారు.. ఇక, అమిత్‌షా వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. వైసీపీని విమర్శించడానికే అమిత్ షా విశాఖకు వచ్చినట్టున్నారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి.. విశాఖ రైల్వే జోన్, మెట్రో రైలు వంటి అంశాలపై అమిత్ షా మాట్లాడడం లేదని నిలదీశారు.. రాష్ట్రానికి సంబంధించి ఏం మాట్లాడకపోయినా.. టీడీపీ, బీజేపీ నేతలు చప్పట్లు కొట్టేస్తున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో 40 గుళ్లు కూలిస్తే బీజేపీ నేతలు మాట్లాడారా..? అని నిలదీశారు. అమిత్ షా తిరుపతి పర్యటనలో గతంలో టీడీపీ నిరసనలు తెలిపిందని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీని చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శించలేదా? అయినా బీజేపీకి సిగ్గు లేదా..? అంటూ ఫైర్‌ అయ్యారు.

Read Also: Priyanka Gandhi: మిషన్‌ మధ్యప్రదేశ్‌ ప్రారంభం. ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ..!

అన్నింటిలోనూ ఏపీ నంబర్ వన్‌ అంటూ కేంద్రం ప్రకటనలు ఇస్తుంటే.. అవినీతి అంటూ అమిత్ షా కామెంట్లు చేస్తారా..? అని నిలదీశారు కారుమూరి.. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందన్న అమిత్ షా.. ఇప్పుడిలా మాట్లాడడం సరికాదని హితవుపలికారు. బహిరంగ సభ వేదిక మీద అందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు.. టీడీపీ నుంచి వచ్చిన బీజేపీ నేతల మనస్సు ఓ చోట.. మనిషి ఓ చోట అన్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక, అమిత్ షా సొంతంగా మాట్లాడారని అనుకోవడం లేదన్న ఆయన.. ఎవరో చెప్పిన మాటలు విని అమిత్ షా ఇలా మాట్లాడ్డం సరికాదన్నారు.. కర్ణాటకలో బీజేపీ పరిస్థితేం అయిందో చూశారుగా.. ఇక్కడ.. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి వచ్చినా జగన్‌ను ఏం చేయలేరు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో సీఎం వైఎస్‌ జగన్ ప్రతి ఇంట్లో మనిషిలా మారారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలదే.. గత ప్రభుత్వంలో కేంద్రం నిధులు విషయంలో ఏం చేశారో.. మేమూ అదే చేశాం అన్నారు. రైతులు రొడ్డేక్కి కేంద్రానికి ఏళ్ల తరబడి ఆందోళనలు చేశారు.. దీనికి అమిత్ షా సిగ్గు పడాలని హితవుపలికారు. చెవిలో ఎవరో ఊదితే.. దాన్నే అమిత్ షా మాట్లాడారు అంటూ సెటైర్లు వేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.