Site icon NTV Telugu

Minister Karumuri Nageswara Rao: నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు సీఎం జగన్.. యుద్ధానికి సిద్ధం..

Karumuri

Karumuri

Minister Karumuri Nageswara Rao: నామీద ప్రతి పక్షాలు బురద చల్లినా.. నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అంటూ సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇంఛార్జ్‌ సునీల్ కుమార్ యాదవ్‌తో కలిసి పాల్గొన్న మంత్రి కారుమూరి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామీద ప్రతి పక్షాలు అనవసరమైన విమర్శలు, ఆరోపణలతో బురద చల్లినా… నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు సీఎం జగన్‌ అన్నారు.. ఇక, కార్యకర్తల కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతాను అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప నిజాయితీ పాలన అందించారని కొనియాడారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గం తణుకు అభివృద్ధికి 3,300 కోట్ల రూపాయాలు కేటాయించారని కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. మూడు కండవాలు (తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ) కప్పుకుని వస్తున్న వారిపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) కార్యకర్తలు యుద్దానికి సిద్ధం అని ప్రకటించారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు.

Read Also: Bramayugam: మమ్ముట్టి నట బీభత్సం.. ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎందులో చూడాలంటే?

కాగా, గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు హాట్‌ కామెంట్లు చేశారు మంత్రి కారుమూరి.. చంద్రబాబు అధికారంలో ఉండగా దొరికినకాడికి అడ్డంగా దోచుకున్నాడని, అందుకే జైలుకు వెళ్లాడని విమర్శించిన విషయం విదితమే.. ప్రజల దృష్టిలో నిజం అంటే వైఎస్‌ జగన్‌.. అబద్ధం అంటే చంద్రబాబు.. అనేది బలంగా ఉందన్నారు. ఇక, ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేయడంతో సీఎం జగన్‌ అంటే నిజం అని జనం అనుకుంటున్నారన్నారు. ఇచ్చిన ఒక్క హామీలను అమలు చేయకపోగా.. మేనిఫోస్టును కూడా మాయం చేసిన చరిత్ర అబద్ధాల చంద్రబాబుది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.

Exit mobile version