Kakani Govardhan Reddy: క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్క్ షాప్‌లో వ్యవసాయ విధానాలపై చర్చిస్తారని ఏపీ వ్యవసాయ శాఖామంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్కువమంది ఎఫ్‌పీవోలను తయారు చేసి రైతులకు మేలు చేయడంపై మాట్లాడతారన్నారు. ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒక ఎంఓయూ చేసుకున్నామని.. సీఎం జగన్ నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతుందని మంత్రి వెల్లడించారు.
Read Also: Malla Reddy: హైకోర్టు మెట్లెక్కిన మల్లారెడ్డి.. విచారణ వాయిదా వేసిన ధర్మాసనం
పండించిన ధాన్యం నిలువ ఉంచేందుకు గోదాములు నిర్మించామని ఆయన చెప్పుకొచ్చారు. తడిసిన ధాన్యానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు కనిపిస్తే భూతద్దంలో చూపొద్దన్నారు. సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ వేస్తామని.. చంద్రబాబు లాగా కాదన్నారు. వర్షం కురుస్తుండగానే నారుమళ్ళు దెబ్బతింటే సహాయం చేశామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.