Minister Jogi Ramesh: లోకేష్, పవన్ కల్యాణ్‌పై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. సినిమా టైటిల్.. ట్యాగ్‌లైన్ కూడా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jogi Ramesh: నారా లోకేష్, పవన్ కల్యాణ్‌తో పాటు నందమూరి బాలకృష్ణపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అంతే కాకుండా.. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర జరిగిన ఎపిసోడ్‌కు ఆయన ఓ సినిమా టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు.. ట్యాగ్‌లైన్ కూడా చెప్పుకొచ్చారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఇద్దరు మెంటల్ కేసులు.. ఆ ఇద్దరి మధ్య పిచ్చి పీకే అంటూ.. లోకేష్, బాలయ్య, పవన్‌పై సెటైర్లు వేశారు.. ”ఇద్దరు మెంటలోళ్ల మధ్య పిచ్చి పీకే’ అనేది సినిమా టైటిల్.. బొక్కలో బాబు 7691 అనేది ట్యాగ్ లైన్ అని పేర్కొన్నారు. జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించటానికి పవన్ కల్యాణ్ వెళ్లాడు.. బీజేపీతో సంసారం చేస్తూనే జైల్లోకి వెళ్లి చంద్రబాబుతో తాళి కట్టించుకున్నాడు.. బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తాను అంటున్నాడంటూ మండిపడ్డారు.
Read Also: Flight Emergency: ప్రయాణికుల గుండె జారిపోయింది.. 10 నిమిషాల్లో 28వేల అడుగులకు విమానం.. ఏమైందంటే..?
Also Read
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్‌కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Pakistan: పాకిస్తాన్‌ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్‌రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
వైసీపీ, జగన్ పై యుద్ధం చేయటం అంటే రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలతో యుద్ధం చేయటమే అన్నారు మంత్రి జోగి రమేష్.. సీఎం వైఎస్ జగన్ పై యుద్ధం చేయటం అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, మహిళలపై యుద్ధం చేయటమే అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో, రాజకీయాల్లో జీరో అని అభివర్ణించారు. స్కిల్ కుంభకోణం జరిగిన టీడీపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ భాగస్వామి అని ఆరోపించారు. 370 కోట్ల కుంభకోణంలో పవన్ కు ఎంత వాటా వచ్చింది? అని ప్రశ్నించారు. పవన్, చంద్రబాబు ఫెవికాల్ బంధం గురించి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసన్నారు మంత్రి జోగి రమేష్.
Read Also: ODI World Cup2023: నేడే వన్డే వరల్డ్ కప్ ఫైనల్, సెమీ ఫైనల్ టిక్కెట్ల విక్రయం
లోకేష్ సిగ్గూ, శరం వదిలేశాడా? అంటూ ధ్వజమెత్తారు మంత్రి జోగి.. ఢిల్లీకి వెళ్ళి ఏం చెబుతాడు? అని ప్రశ్నించిన ఆయన.. మా అయ్య 370 కోట్ల రూపాయలు కొట్టేసి బొక్కలో ఉన్నాడని చెబుతాడా? లోకేష్ స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లాడు.. చంద్రబాబు కోసం స్పెషల్ ఫ్లైట్ లో లాయర్లు వచ్చారు.. కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు అంటూ దుయ్యబట్టారు. ఇక, ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్.. ఓ పొలిటికల్ బ్రోకర్‌ను కలిశాడని విమర్శలు గుప్పించారు మంత్రి జోగి రమేష్.
తాజావార్తలు
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్‌కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్‌ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్‌రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!