Jogi Ramesh: నయా పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఆరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: పేదలు పేదలుగానే ఉండాలని పెత్తనం తమ చేతుల్లోనే ఉండాలనే స్వభావం చంద్రబాబుది అంటూ ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. అమరావతిలోని మందడం, పెనుమాకలలో టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. నయా పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఆరాటపడుతున్నారని.. పేదలకు భూములు ఇవ్వాలని ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.
హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు వెళ్లాడని.. అయినా పేదలు, ప్రభుత్వ విధానమే గెలిచిందన్నారు. 51 వేలకు పైగా మందికి రేపు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం ఇళ్ళు కట్టించి ఇస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉంటే చంద్రబాబుకు అంటరానితనమా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు సమాధి అన్న ఆ సెంటు స్థలంలోనే పేదలు టీడీపీని సమాధి చేయనున్నారని మంత్రి పేర్కొన్నారు.
Also Read
- PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు సవాల్..
- Trump: ఇరాన్‌పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్‌లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
Read Also: Gautam Adani : ప్రపంచంలోని టాప్- 20 బిలియనీర్ల జాబితాలోకి మళ్లీ గౌతమ్ ఆదానీ
రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. మిమ్మల్ని కోస్తే పసుపు రక్తం వస్తుందా? అంటూ మంత్రి ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ పెద్ద ఎత్తున రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి జోగి రమేష్ విజ్ఞప్తి చేశారు. పనికి మాలిన అమరావతి జేఏసీ ఏం చేస్తుంది? పేద వాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇవ్వొద్దని అడ్డుకుంటుందా? అని ప్రశ్నించారు. జగనన్న కాలనీల్లో 5 లక్షల ఇళ్ళు పూర్తి కానున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్‌ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు సవాల్..
-
Trump: ఇరాన్‌పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్‌లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!