Minister Jogi Ramesh: కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. కుప్పంలో నాకు మద్దతిస్తారా..? చంద్రబాబు గారికి మద్దతిస్తారా..? అంటూ సరదాగా సభలో పాల్గొన్నవారిని ప్రశ్నించారు భువనేశ్వరి.. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఆయనకు రెస్ట్ ఇద్దాం.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అంటూ భువనేశ్వరి చమత్కరించారు.. అయితే, నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నారా భువనేశ్వరికి ప్రజల నాడి తెలిసింది.. రాష్ట్రంలోనే కాదు కుప్పంలోనూ టీడీపీ ఓటమి పాలవుతోందని భువనేశ్వరి పసిగట్టారన్నారు.
Read Also: Renuka Chaudhary: రాజ్యసభ ఎంపీ అవ్వడం బహుమతి కాదు.. బాధ్యత పెరిగింది
35 ఏళ్లు ఎమ్మెల్యే గా గెలిచినా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదు అని భువనేశ్వరి గుర్తించారని వ్యాఖ్యానించిన జోగి రమేష్.. కుప్పం ప్రజలు విసిగి వేసారి పోయారని గుర్తించి.. కుప్పం నుంచి పోటీ చేస్తానని అంటున్నారని దుయ్యబట్టారు. ఓటమిని చంద్రబాబు భార్య భువనేశ్వరి ముందుగానే గుర్తించింది.. 175 నియోజక వర్గాల్లో అభ్యర్ధులను నిలబెట్టలేని చవట చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. పొత్తుల కోసం పొర్లాడుతున్న వ్యక్తి చంద్రబాబు.. ఒంటి చేత్తో 151 సీట్లు గెలిచిన వైఎస్ జగన్ తో చంద్రబాబుకి పోలిక అంటూ ఎద్దేవా చేశారు. సొల్లు మాటలు చెప్పే వ్యక్తి చంద్రబాబు.. పొత్తుల కోసం ఎంత మంది కాళ్లైనా చంద్రబాబు పట్టుకుంటాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి జోగి రమేష్ చేసిన పూర్తి వ్యాఖ్యల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..