Minister Jogi Ramesh: మైలవరం రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను పక్కనబెట్టిన వైసీపీ అధిష్టానం.. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను నియమించింది. దీంతో, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వసంత.. వైసీపీని వీడడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.. ఇదే సమయంలో, వైసీపీ టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.. ఇక, వసంత కృష్ణప్రసాద్‌కు మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు.. డబ్బుతో రాజకీయాలు చేసే వ్యక్తి వసంత.. దమ్ముతో రాజకీయం చేసే వ్యక్తి జోగి రమేష్.. వసంత చీడ పురుగు, పిరికి పంద అంటూ ధ్వజమెత్తారు. వసంత గెలుపు కోసం 2019లో నేను పని చేశాను.. వైఎస్ జగన్ ఏం చెబితే నేను అది చేశాను.. అసలు వసంత ఎవడ్రా నువ్వు ? అంటూ విరుచుకుపడ్డారు.
Read Also: PM Modi: హ్యాట్రిక్ విజయం ఖాయం.. లోక్ సభలో ప్రధాని మోడీ..
నేను ఎంత బలవంతుడు అనేది వసంత కృష్ణప్రసాద్ రాష్ట్ర ప్రజలకు చెప్పాడు.. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వసంత ఇప్పుడు అదే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడు.. వసంత ఒక నమ్మక ద్రోహి అంటూ దుయ్యబట్టారు జోగి రమేష్.. సీఎం వైఎస్ జగన్ దగ్గరకు వచ్చి వసంత ఏం అడిగి ప్రాధేయ పడ్డాడో వసంత పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ చేశారు. వసంత ఎలాంటి వాడు అనేది ఆయన చేరబోతున్న టీడీపీ నేత దేవినేని ఉమా చెప్పాడన్నారు. వచ్చే ఎన్నికల్లో మైలవరంలో తిరుపతి రావు యాదవ్ ను గెలిపిస్తాను.. నేను వైఎస్ జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తాను.. సీఎం వైఎస్ జగన్ మాటే నాకు ఫైనల్ అని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్.