Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Minister Jogi Ramesh Counter Attack On Mla Vasantha Krishna Prasad

Minister Jogi Ramesh: వసంత కృష్ణప్రసాద్‌పై జోగి రమేష్‌ కౌంటర్ ఎటాక్.. జగన్ మాటే నాకు ఫైనల్..!

Published Date :February 5, 2024 , 7:19 pm
By Sudhakar Ravula
Minister Jogi Ramesh: వసంత కృష్ణప్రసాద్‌పై జోగి రమేష్‌ కౌంటర్ ఎటాక్.. జగన్ మాటే నాకు ఫైనల్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Jogi Ramesh: మైలవరం రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను పక్కనబెట్టిన వైసీపీ అధిష్టానం.. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను నియమించింది. దీంతో, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వసంత.. వైసీపీని వీడడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.. ఇదే సమయంలో, వైసీపీ టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించారు.. ఇక, వసంత కృష్ణప్రసాద్‌కు మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు.. డబ్బుతో రాజకీయాలు చేసే వ్యక్తి వసంత.. దమ్ముతో రాజకీయం చేసే వ్యక్తి జోగి రమేష్.. వసంత చీడ పురుగు, పిరికి పంద అంటూ ధ్వజమెత్తారు. వసంత గెలుపు కోసం 2019లో నేను పని చేశాను.. వైఎస్‌ జగన్ ఏం చెబితే నేను అది చేశాను.. అసలు వసంత ఎవడ్రా నువ్వు ? అంటూ విరుచుకుపడ్డారు.

Read Also: PM Modi: హ్యాట్రిక్ విజయం ఖాయం.. లోక్ సభలో ప్రధాని మోడీ..

నేను ఎంత బలవంతుడు అనేది వసంత కృష్ణప్రసాద్‌ రాష్ట్ర ప్రజలకు చెప్పాడు.. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వసంత ఇప్పుడు అదే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడు.. వసంత ఒక నమ్మక ద్రోహి అంటూ దుయ్యబట్టారు జోగి రమేష్‌.. సీఎం వైఎస్‌ జగన్ దగ్గరకు వచ్చి వసంత ఏం అడిగి ప్రాధేయ పడ్డాడో వసంత పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్‌ చేశారు. వసంత ఎలాంటి వాడు అనేది ఆయన చేరబోతున్న టీడీపీ నేత దేవినేని ఉమా చెప్పాడన్నారు. వచ్చే ఎన్నికల్లో మైలవరంలో తిరుపతి రావు యాదవ్ ను గెలిపిస్తాను.. నేను వైఎస్‌ జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తాను.. సీఎం వైఎస్‌ జగన్ మాటే నాకు ఫైనల్‌ అని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Minister Jogi Ramesh
  • MLA Vasantha Krishna Prasad
  • Mylavaram

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions