Minister Jogi Ramesh: ప్రజాయుద్ధంలో ఎవరూ వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఓడించలేరు.. మరో 20 ఏళ్లు ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనే ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్.. తాజాగా, వైసీపీ అధిష్టానం ఆయన్ని పెనమలూరు ఇంఛార్జ్‌గా నియమించడంతో.. ఆ నియోజకవర్గంపై దృష్టి సారించారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పడమట సురేష్ నా తమ్ముడు.. నాతోనే వస్తాడు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, రాజశేఖరరెడ్డి అనుచరులు అందరూ మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే పట్టుదలతో ఉన్నారు.. వైసీపీ క్యాడర్ అంతా ఏకతాటి పైకి వచ్చి పని చేస్తారు.. పార్థసారథి (సిట్టింగ్ ఎమ్మెల్యే) కూడా మనసులో జోగి రమేష్ గెలవాలనే కోరుకుంటాడు అని చెప్పుకొచ్చారు.
Read Also: Malla Reddy: పార్టీ ఆదేశిస్తే ఎంపీ బరిలో ఉంటా.. మల్లారెడ్డి మనసులోని మాట..
వచ్చే ఎన్నికల్లో పెనమలూరులో వైసీపీ జెండా ఎగరటం ఖాయం అన్నారు జోగి రమేష్.. ఇక, వైఎస్ షర్మిల.. చంద్రబాబును కలవటంలో తప్పేమీ లేదు అన్నారు. శుభకార్యానికి ఎవరినైనా పిలవచ్చు.. అందులో భాగంగానే చంద్రబాబును కలిసి తన కుమారుడి వివాహానికి రావాలని షర్మిల ఆహ్వానించారని పేర్కొన్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బలంగా ఉన్నాడు కనుకే అందరూ కలిసికట్టుగా వస్తున్నారు.. ప్రజా యుద్ధంలో ఎవరూ వైఎస్ జగన్ ను ఓడించ లేరు.. 20 ఏళ్ల పాటు జగన్ ఈ రాష్ట్రాన్ని పాలిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్. కాగా, పెడన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్‌ని వైసీపీ అధిష్టానం పెనమలూరు ఇంచార్జ్‌గా నియమించిన విషయం విదితమే.. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఎమ్మెల్యే పార్థసారథి.. నియోజకవర్గ ప్రజల మీదే నేను ఆధారపడి ఉన్నాను.. నా భవిష్యత్ కార్యాచరణను పెనమలూరు నియోజకవర్గ ప్రజలే తేలుస్తారు అంటున్నారు. ఇక, వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతోన్న విషయం విదితమే.