చైనా సోమవారం రిలీజ్ చేసిన కొత్త మ్యాప్ ను చైనా వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అందులో తమ భూభాగంలో భారతదేశ ప్రాంతాలను చూపించింది. ఈ వ్యూహంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పందించారు. అసంబద్ధమైన వాదనలు చేయడం ద్వారా ఇతరుల భూభాగం మీది కాదన్నారు. ఓ వార్త ఛానల్ లో ఆయన మాట్లాడుతూ.. చైనాకు ఇలాంటి మ్యాప్‌లను జారీ చేసే అలవాటు ఉందని.. మీ అధికారిక మ్యాప్‌లో ఇతర దేశాల భూభాగాలను చేర్చడంలో అర్థం లేదని జైశంకర్ అన్నారు. చైనా.. భారతదేశానికి చెందిన ప్రాంతాలతో మ్యాప్‌ను విడుదల చేసిందని.. ఇది పాత అలవాటేనని.. కేవలం భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో మ్యాప్‌ను విడుదల చేయడం వల్ల ఎలాంటి మార్పు ఉండదని, తమ ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అసంబద్ధమైన దావాలు చేయడం వల్ల ఇతరుల ప్రాంతం మీది కాదని వ్యాఖ్యానించారు.
Read Also: KA Paul: విశాఖలో సీఐ కాలర్ పట్టుకుని కేఏ పాల్ ఓవరాక్షన్
చైనా జారీ చేసిన ప్రామాణిక మ్యాప్‌ను భారత్ తిరస్కరించింది. ఇందులో 1962 యుద్ధంలో ఆక్రమించిన అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చైనా పిలుస్తుంది. అయితే అక్సాయ్ చిన్ కూడా దాని యాజమాన్యాన్ని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, భవిష్యత్తులో కూడా అది భారతదేశంలో భాగమేనని భారత్ చెబుతోంది. వచ్చే వారాంతంలో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సు, గత వారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సు తర్వాత చైనా ఈ మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం. చైనా మ్యాప్‌లో చేర్చబడిన ఇతర వివాదాస్పద ప్రాంతాలలో తైవాన్ మరియు దక్షిణ చైనా సముద్రంలోని పెద్ద భాగాలు ఉన్నాయి.