Minister Jagadish Reddy: గవర్నర్ పై మంత్రి జగదీశ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jagadish Reddy: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే విధంగా గవర్నర్ చర్యలున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రాజ్ భవన్ పైరవీలకు కేంద్రంగా మారకూడదు. తెలంగాణా బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు పోతుంది..రాజకీయ ఉద్దేశ్యంతో బిల్లుల మీద సంతకాలు పెట్టలేదంటూ తమిళి సైపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్ తమిళి సై సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్‌చేస్తూ కేసీఆర్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాజ్‌భవన్ తీరును వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాజ్యాంగంలోని 32వ అధికరణం ఆధారంగా గురువారం సుప్రీంకోర్టులో సివిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Gas Protest : గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
పిటిషన్‌లో గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేశారు. శాసనసభ, శాసనమండలి బిల్లులను ఆమోదించిన తర్వాత గవర్నర్‌కు పంపితే గత ఐదు నెలలుగా ఏడు బిల్లులు, గత నెల రోజుల నుంచి మూడు కలిపి మొత్తం పది బిల్లులకు రాజ్‌భవన్ ఆమోదం తెలుపలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్‌భవన్ తీరువల్ల ప్రజా ప్రభుత్వం చట్టసభల ద్వారా తీసుకొన్న నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని 194 పేజీల పిటిషన్‌లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తున్న ఫైల్స్ ను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా వెనక్కు పంపుతున్నారని జగదీష్ రెడ్డి గతంలో ఆరోపించారు . తెలంగాణ గవర్నర్ మొదటినుంచి ఫైళ్లను కావాలని ఆలస్యం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మొదట్లో ఆమెకు సమయం తక్కువగా ఉందని భావించామని, కానీ ఉద్దేశపూర్వకంగానే ఫైళ్ళను గవర్నర్ ఆపుతున్నారు అని అర్థమవుతుందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!