NTV Telugu Site icon

Minister Jagadish Reddy: గవర్నర్ పై మంత్రి జగదీశ్ ఫైర్

Minister Jagadish Reddy

Minister Jagadish Reddy

Minister Jagadish Reddy: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే విధంగా గవర్నర్ చర్యలున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రాజ్ భవన్ పైరవీలకు కేంద్రంగా మారకూడదు. తెలంగాణా బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు పోతుంది..రాజకీయ ఉద్దేశ్యంతో బిల్లుల మీద సంతకాలు పెట్టలేదంటూ తమిళి సైపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్‌ తమిళి సై సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్‌చేస్తూ కేసీఆర్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగ‌తి తెలిసిందే. రాజ్‌భవన్‌ తీరును వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాజ్యాంగంలోని 32వ అధికరణం ఆధారంగా గురువారం సుప్రీంకోర్టులో సివిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Read Also: Gas Protest : గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా

పిటిషన్‌లో గవర్నర్‌ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేశారు. శాసనసభ, శాసనమండలి బిల్లులను ఆమోదించిన తర్వాత గవర్నర్‌కు పంపితే గత ఐదు నెలలుగా ఏడు బిల్లులు, గత నెల రోజుల నుంచి మూడు కలిపి మొత్తం పది బిల్లులకు రాజ్‌భవన్‌ ఆమోదం తెలుపలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ తీరువల్ల ప్రజా ప్రభుత్వం చట్టసభల ద్వారా తీసుకొన్న నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని 194 పేజీల పిటిషన్‌లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తున్న ఫైల్స్ ను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా వెనక్కు పంపుతున్నారని జగదీష్ రెడ్డి గతంలో ఆరోపించారు . తెలంగాణ గవర్నర్ మొదటినుంచి ఫైళ్లను కావాలని ఆలస్యం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మొదట్లో ఆమెకు సమయం తక్కువగా ఉందని భావించామని, కానీ ఉద్దేశపూర్వకంగానే ఫైళ్ళను గవర్నర్ ఆపుతున్నారు అని అర్థమవుతుందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

Show comments