NTV Telugu Site icon

Harish Rao: బీఆర్ఎస్ సర్కార్ రైతును రాజు చేసింది..

Harish Rao

Harish Rao

రైతు బంధు పథకం కొత్తది కాదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈసీనీ కాంగ్రెస్ నేతలు కలిసి రైతు బంధు ఆపాలని కోరింది అని ఆయన తెలిపారు. కేసీఅర్ రైతు బంధు తర్వాతే కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ తీసుకు వచ్చింది.. రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు.. 69 లక్షల మందికి రైతు బందు అందుతోంది.. కాంగ్రెస్ పార్టీ కుట్రతో వ్యవహరిస్తుంది.. రైతు బంధు సకాలంలో అందకుండా చేస్తుంది.. రేపు అసరా పెన్షన్ తో పాటు ఇతర స్కీమ్ లు ఆపమని కాంగ్రెస్ కోరుతుంది ఏమో? అని హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు. రైతు బంధు ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు లెటర్ ఎలా ఇస్తుంది? అని ఆయన ప్రశ్నించారు.

Read Also: Varun- Lavanya: వరుణ్- లావణ్య శుభలేఖ చూసారా.. ఎలా ఉందో..?

కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేఖ ప్రభుత్వం అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఉచిత కరెంట్ అని కాంగ్రెస్ … ఉత్త కరెంటు చేసింది.. కర్ణాటక నుంచి రైతుల వచ్చి గద్వాల్ ,కొడంగల్ లో కాంగ్రెస్ ను నమ్మవద్దని చెబుతున్నారు.. కర్ణాటకలో కనీసం 5 గంటలు కరెంటు కూడా ఇవ్వడం లేదు అని ఆయన ఆరోపించారు. మూడు గంటలు కరెంట్ ఇవ్వడం లేదు అని కర్ణాటక రైతులు ఆందోళన చేస్తున్నారు.. కాంగ్రెస్ సర్కార్ నీళ్ళు ఇవ్వకపోయినా.. నీటి తిరువా కట్టించుకుంది అని మంత్రి పేర్కొన్నారు. కేసీఅర్ వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. బీఆర్ఎస్ సర్కార్ రైతును రాజు చేసింది అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

Read Also: Mahar Yodh 1818: ‘కోరేగావ్ యుద్ధం’పై సినిమా.. ఫాంటసీ థ్రిల్లర్ గా!

పొరపాటున, గ్రహ పాటున గెలిస్తే రైతు బంధుకు కాంగ్రెస్ రామ్ రామ్ అంటది అని హరీశ్ రావు చెప్పారు. మూడు గంటలు కరెంటు రైతులకు ఇస్తది.. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దండగ అన్నారు.. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలో రైతులను రోడ్డు మీదకు తీసుకు వచ్చారు.. రైతుల మీద ప్రేమ ఉంటే ఈసీకి ఇచ్చిన లేఖను కాంగ్రెస్ వెనక్కి తీసుకోవాలి.. తప్పు జరిగిందని కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవాలి.. రైతు బంధు ఒక నెల రోజులు అపుతారేమో? కానీ, మళ్ళీ యధావిధిగా రైతు బంధు ఇస్తామని ఆయన వెల్లడించారు. రైతు రుణమాఫీ మూడు వేల కోట్లు చేయాలని ఈసీకి లేఖ రాశాం.. ఈసీ అనుమతి ఇస్తే మిగిలిన వ్యవసాయ రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.