NTV Telugu Site icon

కలవరపెడుతోన్న కోవిడ్‌ కొత్త వేరియంట్.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్

కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గిపోయింది.. ఇప్పట్లో థర్డ్‌ వేవ్‌ ముప్పుకూడా పెద్దగా ఉండకపోవచ్చు అనే అంచనాలు వేశారు.. కానీ, కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బి.1.1.529 కేసులు వెలుగుచూస్తున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.. అప్రమత్తమైన బ్రిటన్​, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చెక్​ రిపబ్లిక్​, ఇజ్రాయెల్​, సింగపూర్​లు సదరన్​ఆఫ్రికా దేశాలపై ట్రావెల్​బ్యాన్​విధించాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది..

Read Also: కొడాలి నాని ఇకనైనా మనిషిగా బతకాలి..! ఆడవాళ్లు కొట్టకుండా ఆయనకి సెక్యూరిటీ..!

దీనికోసం రేపు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు మంత్రి హరీష్‌రావు.. కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు, టూరిస్టుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, ఇదే విషయంలో ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం.. సౌతాఫ్రికా నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమాన సర్వీసులు లేని కారణంగా ముంబై, ఢిల్లీలో దిగి హైదరాబాద్ వచ్చే వారిని ట్రెసింగ్‌, టెస్టింగ్‌కి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించనున్నారు మంత్రి హరీష్‌రావు.