NTV Telugu Site icon

Minister Harish Rao: డీకే శివకుమార్‌కు మంత్రి హరీశ్ థ్యాంక్స్.. డీకే నిజాలే చెప్పారు!

Harish Rao

Harish Rao

Minister Harish Rao: నర్సాపూర్ గెలుపు బాధ్యత సీఎం కేసీఆర్ నాపైనే వేశారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అవకాశం నర్సాపూర్‌కి రావడం అదృష్టమన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం.. చావు నోట్లో తల పెట్టి సీఎం కేసీఆర్ తెలంగాణ తెచ్చారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ వస్తేనే మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే మదన్ రెడ్డిదేనని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. మదన్ రెడ్డిని ఎంపీ చేసే బాధ్యత తనదని మంత్రి చెప్పారు.

Also Read: Revanth Reddy: సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై మంత్రి హరీశ్‌ రావు ఫైర్ అయ్యారు. కర్ణాటకలో మూడు గంటల కరెంట్ ఇస్తున్నామని మేము చెప్పామని… కర్ణాటకలో 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని నిన్న డీకే శివకుమార్ నిజాలు చెప్పారన్నారు మంత్రి హరీశ్. కానీ 5 గంటలు ఇవ్వట్లేదు 3 గంటలే ఇస్తుందని మంత్రి చెప్పారు. డీకే శివకుమార్ మాటలతో కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టుకున్నట్లు అయిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్‌కు థ్యాంక్స్ చెబుతున్నామన్నారు. నువ్వే 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పావ్.. ఇంకా బస్సెందుకు కర్ణాటక రావడానికి అంటూ మంత్రి హరీశ్ ఎద్దేవా చేశారు. డీకేనే నిజాలు చెప్పారు కదా.. కర్ణాటక మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. “రైతు బంధు డబ్బులు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు లేదు. రేవంత్ మూడు గంటల కరెంట్ చాలు అంటాడు. డీకే శివకుమార్ ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని అంటాడు. రైతులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి. తస్మాత్ జాగ్రత్త.. మోసపోతే గోస పడుతాం. మెడమీద తలకాయ ఉన్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన కళ్ళల్లో మనం పొడుచుకున్నట్టే. కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెబుతుంది. కాంగ్రెస్ వాళ్లు బట్టేబాజ్ గాళ్ళు వాళ్ళవి తిట్లు…మనవి కిట్లు. కాంగ్రెస్ బూతులు కావాలా…తెలంగాణ భవిష్యత్తు కావాలా.” అని మంత్రి హరీశ్ రావు ప్రజలకు సూచించారు.