NTV Telugu Site icon

Harish Rao: ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్‌ చేసింది కాంగ్రెస్‌ కాదా?

Harish Rao

Harish Rao

Harish Rao: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌ రావు సమక్షంలో ఓదెల జడ్పీటీసీ రాములు యాదవ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి హరీశ్‌ బీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్‌ చేసింది కాంగ్రెస్‌ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలాంటి కాంగ్రెస్ మనకు అవసరమా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఒక ముఠా చేతుల్లోకి వెళ్లిందన్న మంత్రి.. కాంగ్రెస్ చేతుల్లోకి రాష్ట్రం వెళ్లడం మంచిది కాదన్నారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి చేతుల్లోకి పోతే రాష్ట్రం ఏమైపోతుందని ఆయన ప్రశ్నించారు.. రేవంత్‌ రెడ్డికి హార్స్‌ పవర్‌ అంటే తెలుసా అంటూ మంత్రి హరీశ్ అన్నారు. రైతుబంధు ఇస్తే, బిచ్చం వేస్తున్నారని రేవంత్‌ రెడ్డి అంటున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్‌ కృషి వల్లనే తెలంగాణలో భూముల విలువ పెరిగింది.. 2-3 గంటల కరెంట్‌ కూడా కర్ణాటకలో ఇవ్వడం లేదని మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు.

Also Read: Kaleru Venkatesh: ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న మహిళలు, యువకులు

పెద్దపల్లి జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి చెప్పారు. రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుంచి బీఆర్‌ఎస్, తెలుగుదేశం ఇప్పుడు కాంగ్రెస్ ఇలా పార్టీలు మారటమే పని అంటూ విమర్శించారు. ఆయనకు నీతి జాతి లేదని మంత్రి హరీశ్‌ విమర్శించారు. ఆయనకు పార్టీలు మారటం తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. రేవంత్ రెడ్డి ఏనాడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలేదని, పోగ తుపాకులు పట్టుకొని బెదిరించాడన్నారు మంత్రి హరీశ్. ఉద్యమ సమయంలో ఒక్కనాడు మాతో కలిసి రేవంత్ రెడ్డి రాలేదన్నారు. పెద్దపల్లి భూముల విలువ ఎంత ఉండే… ఇప్పుడు ఎంత ఉంది గమనించాలన్నారు.

 

Show comments