NTV Telugu Site icon

Harish Rao: మీరించ్చిదేమి లేదు.. మాకు వచ్చే డబ్బుల్నే ఆపారు

Harish Rao

Harish Rao

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకం పేరు మార్చి మోడీ ప్రభుత్వం కాపీ కొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేం పని మంచిగా చేయకపోతే ఎందుకు మా పథకాలను కాపీ కొట్టారు.. ఎందుకు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి అని ప్రధాని మోడీ అంటున్నారు.. పెట్టుబడులు వస్తున్నాయి అంటే కేసీఆర్ గొప్పతనం అని మంత్రి పేర్కొన్నారు.

Read Also: Richest Cricketer: ఇండియాలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా.. ఎన్ని కోట్లంటే..!

తెలంగాణకి చాలా నిధులు ఇచ్చామని ప్రధాని అంటున్నారు.. మీరు డబ్బులు ఇవ్వలేదు.. మాకు రావాల్సిన నిధులు ఆపారు అంటూ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండంటూ అడిగారు. నీతి అయోగ్ చెప్పినా డబ్బులు ఇవ్వలేదు.. బావుల కాడా మీటర్లు పెట్టాలేదనీ రూ. 21 వేల కోట్లు ఆపింది మీరు అని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుంది.. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కళ్ళలో వాళ్లకు మంటలు వస్తున్నాయి.

Read Also: Manoj Muntashir: నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి.. ఆదిపురుష్ రైటర్

మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజన యూనివర్సిటీ ఇవ్వండి.. కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. బురద జల్లుడు తప్ప మీరు చేసేందేమి లేదు.. ఏమన్నా అంటే ఈడీని ఉపయోగిస్తున్నారు.. మీకు ఈడీలు, సీబీఐలు అండగా ఉండవచ్చు.. మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు.. లడ్డులు గుజరాత్ కి ఇచ్చి పిప్పర్ మెంట్లను తెలంగాణకు ప్రధాని ఇస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.