Site icon NTV Telugu

Harish Rao: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్

Harish

Harish

తెలంగాణ-ఏపీ విడిపోయినప్పుడు సంబరాలు చేసుకోలేదని ప్రధాని మోడీ చెప్పారు.. మోడీ కడుపులో ఉన్న విషాన్ని బయటికి కక్కుతున్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మనకి రావాల్సిన ప్రాజెక్టును ఆంధ్రకు తీసుకుపోయారు.. బీజేపీవి అన్ని అబద్ధాలే.. మాకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా.. మాపై విష ప్రచారాలు మానుకోవాలి అంటూ ఆయన విమర్శించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ 6 పథకాల మాట దేవుడెరుగు.. కానీ 6 నెలలకు ఒక సీఎం మారుతాడు అంటూ హరీశ్ రావు సెటైర్ వేశాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కర్ఫ్యూ వస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. తుమ్మాలన్న, దగ్గలన్నా కాంగ్రెస్ వాళ్లు హై కమాండ్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని హరీశ్ రావు అన్నారు.

Read Also: CM Yogi Adityanath: గర్భిణీ స్త్రీలకు యూపీ సీఎం కానుక.. న్యూట్రిషన్ కిట్ పంపిణీ

గతంలో ఇక్కడ ధాన్యం కొనకపోతే బీదర్ పోయి అమ్ముకునే వాళ్ళు అంటూ మంత్రి హరీశ్ రావు అన్నారు. కానీ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ధాన్యం అమ్ముకుంటున్నారు.. త్వరలో కాళేశ్వరం నీళ్లు నారాయణఖేడ్ నియోజకవర్గానికి వస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లు 6 గ్యారెంటీ స్కీములు అంటున్నారు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో వాళ్ల పాలన ఎలా ఉందో చూస్తే తెలుస్తుంది అని విమర్శించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్లు ఎంతకైనా దిగజరుతారు.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినవి అన్ని బోగస్ మాటలు.. వాళ్ళని నమ్ముకుంటే మన బతుకు ఆగమే.. ఎలాగో తెలంగాణలో అధికారంలోకి రామని చెప్పి లేని పోనీ మాటలు చెబుతున్నారు అని హరీశ్ రావు వెల్లడించారు.

Read Also: Allu Arjun: మరో అరుదైన గౌరవం అందుకోనున్న అల్లు అర్జున్..

Exit mobile version