Gudivada Amarnath: చంద్రబాబు, ఆయన కొడుకు శిక్ష అనుభవించక తప్పదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: చంద్రబాబును ప్రజా కోర్టులోకి ఈడుస్తాం.. అక్కడ సమాధానం చెప్పాలి.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ శిక్ష అనుభవించక తప్పదు అని హెచ్చరించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఒక బ్యాక్ డోర్ పొలిటీషియన్ అని దుయ్యబట్టారు. నారావారిపల్లి నుంచి జూబ్లీహిల్స్ భవంతి వరకు అవినీతి పునాదులు మీద నిర్మించారని సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. రూ.118 కోట్లు లంచం తీసుకున్నారని ఆదాయపన్ను శాఖ చెబుతుంటే చంద్రబాబు ఎందుకు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. అన్నా హజారే అనుచరుడు.. గాంధీజీ తమ్ముణ్ణి అని చెప్పుకునే చంద్రబాబు.. తనపై లంచగొండి ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
ఇక, ఆదాయపన్నుశాఖ తీగ లాగితే చంద్రబాబు డొంక కదలడం ఖాయం అన్నారు మంత్రి అమర్నాథ్.. రాష్ట్రం ఆస్తులు, ప్రజాధనం ఎలా దోపిడీకి గురైందో మొత్తం లెక్కలు బయటకు రానున్నాయన్న ఆయన.. ఐటీ శాఖ 46 పేజీలు షోకాజ్ నోటీసు ఇస్తే.. తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించాడు.. నోటీసులు వచ్చిన ప్రతీసారీ పొంతన లేని లేఖలు రాసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎలా..? అని ఫైర్ అయ్యారు. అమరావతిలో దొంగతనం చేసి.. జ్యురిడిక్షన్ కాదని ఐటీ శాఖతో వితండ వాదన చేస్తున్నారని విమర్శించారు. మనోజ్ వాస్ దేవ్ పార్ధసాని అనే వ్యక్తి ద్వారా సబ్ కాంట్రాక్టు ద్వారా లంచాలు ఎలా తీసుకున్నారో ఐటీ అధికారులు రాబట్టారు.. 2016 నుంచి ఎంవీపీకి చంద్రబాబు కార్యాలయంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. CRDA, హైకోర్టు, టిడ్కో ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టుల దగ్గర నుంచి ముడుపులు అందాయని.. కోట్లు అంటే అందరికీ తెలుస్తామని టన్నులు అనే కోడ్ లాంగ్వేజ్ వాడారని.. చంద్రబాబే కాదు ఆయన కొడుకు పేరు ఐటీ జాబితాలో ఉందన్నారు.
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్క్రిల్డ్ పొలిటీషియన్ అని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి అమర్నాథ్.. అవినీతి చరిత్ర అంతా రుజువులతో సహా బయటకు వస్తున్నాయి.. నువ్వు తుప్పు పట్టేసినోడివి.. నేను నిప్పును అంటే ఎవరు నమ్మరు అని ఎద్దేవా చేశారు. సీమెన్స్ వంటి కంపెనీని స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ లోకి లాగిన ఘనుడు చంద్రబాబు. స్కిల్ డవలప్ మెంట్.. అమరావతి భూములు.. ఇలా ఎక్కడ చూసిన అవినీతికి పాల్పడి.. ఎందుకు నోరు మెదపడం లేదు..? అని నిలదీశారు. చంద్రబాబు ఆయన కొడుకు వాటాదారులు శిక్ష అనుభవించక తప్పదు అని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబును ప్రజా కోర్టులోకి ఈడుస్తాం.. అక్కడ సమాధానం చెప్పాలి.. విదేశీ లావాదేవీలు ఉన్నందున “ఈడీ” ఎంటరై “కేడీ”ని పట్టు కోవాలని డిమాండ్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
తాజావార్తలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!