Site icon NTV Telugu

Gudivada Amarnath: వైసీపీ ప్రభుత్వంలో 1.9లక్షల కోట్ల పెట్టుబడులు

Amar1

Amar1

మార్చి 3, 4 తేదీల్లో జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బెంగుళూరులో రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. బెంగుళూరులో జరిగిన జీఐఎస్ రోడ్ షోకు హాజరయ్యారు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్. ఈసందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడారు. దేశ ఆర్ధిక ప్రగతిలో ఏపీ కీలక భూమిక పోషిస్తోంది.దేశం నుంచి జరిగిన ఎగుమతుల్లో ఏపీ నుంచి 4.6 శాతం మేర ఉన్నాయి.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఏపీ అగ్రస్థానంలో ఉంది.

Read Also: Gali Bhanuprakash: నగరిలో రోజా అవినీతికి అడ్డూఅదుపూ లేదు

పరిశ్రమలకు కేటాయించేందుకు 49 వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉంది.దీనికి అదనంగా లక్ష ఎకరాల భూమి పరిశ్రమల కోసం కేటాయించాం.దేశంలో ఎక్కడా లేనట్టుగా 3 పారిశ్రామిక కారిడార్లు ఏపీలో ఉన్నాయి.ఈ కారిడార్లల్లో 48 వేల ఎకరాల భూమి కూడా పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉంది.కోవిడ్ పరిస్థితులు దాటుకుని ఏపీ 11.46 శాతం వృద్ధి నమోదు చేస్తోంది.కియా, బ్రాండిక్స్, ఆపాచే లాంటి విదేశీ సంస్థలు ఏపీలో పని చేస్తున్నాయి.శ్రీసిటీలో 28 దేశాలకు చెందిన వేర్వేరు కంపెనీలు పారిశ్రామిక ఉత్పత్తిలో ఉన్నాయి.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1.9 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చింది.

కొత్తగా 3 పోర్టుల నిర్మాణంతో ఏపీలో పోర్టుల సంఖ్య 10కి చేరుతుంది. పోర్టులు సిద్ధం అయితే ఏపీ నుంచి జరిగే ఎగుమతులు 10 శాతానికి చేరతాయని అంచనా వేస్తున్నాం. పోర్టు ఆధారిత ఉత్పత్తి పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వివిధ రంగాల వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. నైపుణ్యం ఉన్న మానవ వనరుల్ని అందించేందుకు వీలుగా నైపుణ్యాభివృద్ధి సంస్థలూ ఏర్పాటు చేశాం. పరిశ్రమలు అతితక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసుకునేలా వివిధ చర్యలూ చేపట్టాం. ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం అన్నారు మంత్రి అమర్నాథ్.

Read Also: Ishant Sharma: షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..ఇషాంత్ ఏమన్నాడంటే!

Exit mobile version