Gottipati Ravi Kumar: ఇచ్చిన మాటలను ప్రభుత్వం నిలబెట్టుకుంది.. రాజముద్ర పునరుద్ధరణపై మంత్రి హర్షం
- త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలన్న..
- సీఎం చంద్రబాబు నిర్ణయంపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హర్షం వ్యక్తం
- ఇచ్చిన మాటలను ప్రభుత్వం నిలబెట్టుకుంది- గొట్టిపాటి రవి కుమార్
త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి పట్టాదారు పాసుపుస్తకం పై రాజముద్ర వేసి ఇస్తామని చెప్పిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు.
Read Also: Borewell Incident: బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలిక.. పుట్టిన రోజు వేడుకలకు ముందే ఘటన..
దేశంలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా జగన్ మోహన్ రెడ్డి పట్టాదారు పాసు పుస్తకాలపై తన బొమ్మను ముద్రించుకున్నారని తెలిపారు. ఇది జగన్ రెడ్డి ప్రచార పిచ్చికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.15 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. పొలాల సరిహద్దు రాళ్లపై కూడా తన బొమ్మను ముద్రించి జగన్ మోహన్ రెడ్డి రూ.700 కోట్ల ప్రజాధనం వృధా చేశారని.. ఈ సొమ్మును సరిగ్గా వినియోగించుకుని ఉంటే రాష్ట్రంలోని ఏదో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేదని వివరించారు.
Read Also: Nayanthara: మొన్న సమంత.. నేడు నయనతార..
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూస్తే ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ముసుగు రాజకీయాలు వద్దు.. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయండి
-
Smriti Irani: మహిళల హక్కులు హరించి సంబరాలా? కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
Slum Dog Release: పూరీ-విజయ్ ‘స్లమ్ డాగ్’ రిలీజ్ ఆలస్యం.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
-
CM Revanth Reddy : బయ్యారం ఉక్కు.. హైదరాబాద్ ఈవీ హబ్..
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!