మునుగోడు విజయంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తమ విచక్షణతో, తెలివైన నిర్ణయం తీసుకున్న మునుగోడు ప్రజలకు శుభాకాంక్షలు.. అభినందనలు.. తెలిపారు. గెలిచిన టీఆరెఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి. నేను ప్రచారం చేసిన చండూరులో టీఆర్‌ఎస్‌కి భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య విజయమని, మునుగోడు ప్రజల విజయమన్నారు మంత్రి ఎర్రబెల్లి. సీఎం కెసిఆర్ వెంటే తెలంగాణ అని మరోసారి రుజువైందన్నారు మంత్రి ఎర్రబెల్లి. టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Parachute Stunts At Rahul yatra: పారాచూట్ తో యువకుడి విన్యాసాలు.. వైరల్
ఎప్పటికైనా తెలంగాణలో కారుదే జోరు అన్న మంత్రి ఎర్రబెల్లి.. కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు. బీజేపీపై బీఆర్‌ఎస్ తొలి విజయమని, మునుగోడు విజయంతో దేశంలో బీఆర్‌ఎస్ జైత్ర యాత్ర మొదలన్నారు. మునుగోడులో అన్ని పార్టీలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.. ప్రభుత్వాలను కూల దోసె కుట్రలు చేస్తున్న బీజేపీకి ఓటుతో పోటు పొడిచారన్నారు. తెలంగాణలో కుట్రలు చెల్లవని బీజేపీ చెంప చెల్లుమనిపించిన ప్రజలు.. గుజరాత్ గులాంలకు తెలంగాణ సలాం చేయదని తేల్చి చెప్పిన విజయమన్నారు. ఈ విజయం తెలంగాణ ఆత్మగౌరవ విజయం, ఇదీ కేసీఆర్ విజయం అని ఆయన వ్యాఖ్యానించారు.