Minister Dharmana Prasada Rao: ఎచ్చెర్లను ప్రజల కోరిక మేరకే శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గం కొనసాగించామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా చిలకలపాలెంలో సామాజిక సాధికార యాత్రలో మంత్రి ప్రసంగించారు. మత్స్యకారుడైన అప్పలరాజును మంత్రిని చేయడంతో బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్ హార్బర్లు వచ్చాయన్నారు. విద్యా వైద్యాన్ని బలోపేతం చేశామని మంత్రి చెప్పారు. పార్టీ చూడొద్దు , కులం , మతం చూడకుండా సంక్షేమం అందించామని ఆయన పేర్కొన్నారు. పేదరికంతో ఉండి దరఖాస్తు చేస్తే సంక్షేమం అందిస్తామని హామీ ఇచ్చారు.
Read Also: CM YS Jagan: అంబేడ్కర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్ష
చంద్రబాబు నాడు అప్పులు తీరుస్తామని చెప్పి ఎవరి అప్పూ తీర్చలేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ సర్కారులో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చామన్నారు. ధరలు పెరిగాయంటున్న చంద్రబాబు ఏ రాష్ట్రంలో తక్కువ ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు దొంగమాటలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నాయని ఆయన విమర్శించారు. విశాఖ రాజధాని అని కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పినా బాబు అమరావతిలో పెట్టారని మంత్రి మండిపడ్డారు.