NTV Telugu Site icon

Minister Dharmana Prasada Rao: అన్ని రంగాలలో జగన్ మార్పులు తెచ్చారు.. చర్చకు సిద్ధమా?

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Minister Dharmana Prasada Rao: జగన్ పాలన మిగతా పాలనకు భిన్నమని… అన్ని రంగాలలో జగన్ మార్పులు తెచ్చారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మొద్దబ్బాయికి ఏమి తెలుసు.. పాడు చేసేస్తున్నాడు అంటాడని.. రాజధాని పేరు చెప్పి వ్యాపారం చేసుకునే చంద్రబాబుకు పేదవాడి కష్టాలు ఎప్పుడు తెలుస్తాయని ఆయన విమర్శించారు. పనికిమాలిన మాటలను ప్రజలు పట్టించుకోరన్నారు. ముష్టి పరిపాలనలో ఇసుమంత మార్పు తెలీదు.. నువ్వా ఈ పాలనను విమర్శించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Balineni Srinivas Reddy: ఈ ఎన్నికల్లోనే నా చివరి పోటీ.. బాలినేని సంచలన వ్యాఖ్యలు

ఈ జిల్లాలో 14 ఏళ్ల పాలనలో నువ్వు తెచ్చిన ఒక్క ప్రాజెక్ట్ చెప్పు అంటూ ఆయన ప్రశ్నించారు. చెవులు లేవు, కళ్ళు లేవు .. రెండింటిలో రెండు బిండలు పెట్టుకున్నావు.. నీకు అభివృద్ధి ఎలా కనిపిస్తుందంటూ చంద్రబాబును ఉద్దేశించి తీవ్రంగా వ్యాఖ్యానించారు. అభివృద్ధిపై చంద్రబాబు కాదు ఎవరు మాట్లాడలేరు.. రమ్మను ఒక వేదికపైకి ఎవరినైనా చర్చకు అంటూ ధర్మాన సవాల్‌ విసిరారు. చంద్రబాబు నీకు నాలెడ్జ్ లేదు.. నాలెడ్జ్ ఉన్నా ప్రజలను మాయ చేస్తావు అంటూ ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే ఇవాల్టికి నీకు తెలియకపోవటం మా దురదృష్టమన్నారు. నీ మాటలకు ప్రజల జీవనం మారదన్నారు. జగన్ ఓడిపోతాడు అని అంటున్నారు.. ఎలా ఓడిపోతారని ప్రశ్నించారు. భర్తలను కాదని సగం మంది ఓటర్లుగా ఉన్న ఆడవాళ్లే వైసీపీకి ఓటు వేస్తారన్నారు. నీకు అధికారం ఇస్తే అమరావతి, రియల్ ఎస్టేట్ తప్ప ఇంకేమి చేస్తావంటూ ప్రశ్నించారు. 25 అంతస్తుల భవనం కాదు అభివృద్ధి అంటే… ప్రజల జీవన స్థితిగతుల సూచికను పెంచటమే అభివృద్ధి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.