Site icon NTV Telugu

Damodar Raja Narsimha: గాంధీ, ఉస్మానియా బలోపేతానికై ఫార్మా కంపెనీలు ఆ నిధులను అందించాలి..

Damodara Raja Narsimha

Damodara Raja Narsimha

Damodar Raja Narsimha: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనలకు ఫార్మా కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర వైద్యారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమావేశం నిర్వహించారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల పూర్వ వైభవానికి సామాజిక బాధ్యతగా ఫార్మా కంపెనీలు తమ సీఎస్‌ఆర్ నిధులను విరివిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ప్రాధాన్యత రంగాలైన పేషెంట్ కేర్, శానిటేషన్, డైట్, బయో – మెడికల్ వేస్టేజ్, డ్రింకింగ్ వాటర్ సప్లైలతో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించటానికి అవసరమైన సిబ్బంది, విద్య, వైద్య రంగాలతో పాటు గర్ల్స్ చైల్డ్ ఎడ్యుకేషన్ లాంటి అంశాలలో ఫార్మా కంపెనీలు తమ సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ను అందించాలని కోరారు. మంత్రి విజ్ఞప్తి మేరకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల బలోపేతానికి ఫార్మా కంపెనీలు తమ సీఎస్‌ఆర్ విధులను విడుదల చేసేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

Read Also: Telangana: షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు

రాష్ట్రంలోని 12 ప్రముఖ ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఈ వారంలో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో ప్రాధాన్యత కలిగిన అంశాలపై టెక్నికల్‌గా నివేదికను సమర్పిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో రోగులకు అవసరమైన, నాణ్యమైన, మెరుగైన సేవలను అందించేందుకు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సమర్పించాలని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరిండెంట్లను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

Exit mobile version