Minister Dadisetti Raja: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా.. తాను సీఎంను కావడానికి సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించిన పవన్.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్న నేపథ్యంలో.. పవన్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు దాడిశెట్టి.. పవన్ ను ఆ పార్టీ నేతలు మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలని సూచించారు.. గంటకో విధంగా.. పూటకో రకంగా పవన్ మాట్లాడుతున్నారు. అసలు ఆయన సభలకు జనం రావడం లేదన్నారు.. ఈ సభలతో పవన్ నవ్వులపాలవుతున్నారని.. పవన్‌ను సీఎం కాదు గదా.. ఎమ్మెల్యేను చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు దాడిశెట్టి రాజా.. ఇక, పేర్నినాని ఇంట్లో చెప్పులు, డ్రాయర్లు, లుంగీలు పోయాయని ఆయన మనుషులు చెబుతున్నారని సెటైర్లు వేశారు.. చెప్పులు, లుంగీలు, లుంగీలతో ఎవరైనా కనిపిస్తే.. మచిలీపట్నంలో అప్పగించాలంటూ ఎద్దేవా చేశారు.. తాను మంచి చేశానని భావిస్తేనే సీఎం జగన్ ఓటు వేయమంటున్నారు. అలా చెప్పే ధైర్యం చంద్రబాబు, పవన్‌కు ఉందా?. అని ప్రశ్నించారు మంత్రి దాడిశెట్టి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ రెండు సభలు ప్లాప్ అయ్యాయి. ఎక్కడి పోటీ చేస్తాడో పవన్‌కే క్లారిటీ లేదు. నవ్వు సీఎం అయిపోవాలనుకుంటే అయిపోవు.. ప్రజలు మద్దతిస్తేనే అవుతావు అని హితవుపలికారు.
ఇక, 2014-19లో టీడీపీ, పవన్, బీజేపీ కలిసి మేనిఫెస్టో రూపొందించారు. మేనిఫెస్టో హామీలు అమలు చేయకపోతే చంద్రబాబును నిలదీశావా పవన్ కల్యాణ్ అంటూ దుయ్యబట్టారు దాడిశెట్టి రాజా.. పవన్ సభలకు జనం రావడం లేదు.. 2వేలు, 5వేల మంది వరకే వస్తున్నారు.. ఇలా తక్కువ మంది జనం వస్తే.. నీ యజమాని దగ్గర (చంద్రబాబు) మాట వస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ నేరాలు చూసినా పచ్చ పార్టీ మూలాలే బయటపడుతున్నాయి.. అసలు పవన్ మాటలు సంస్కారహీనం అన్నారు. పవన్‌ను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైక్రియాటిస్ట్‌కు చూపించాలి. చంద్రబాబు ప్యాకేజీ సరిగా ఇవ్వడేమోనని అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నావు. టీడీపీ ప్రభుత్వంలో ఆలయాలను కూల్చేస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు? అంటూ నిలదీశారు మంత్రి దాడిశెట్టి రాజా..