NTV Telugu Site icon

Chellluboina Venugopal: టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితాపై మంత్రి చెల్లుబోయిన సంచలన వ్యాఖ్యలు

Chelluboina Venu

Chelluboina Venu

Minister Chellluboina Venugopala Krishna: టీడీపీ- జనసేన పొత్తులో టిక్కెట్ల కేటాయింపుపై రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- జనసేన పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత డొల్లతనం బయటపడిందని ఆరోపించారు. టిక్కెట్ల ప్రకటనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు తీవ్రంగా అవమానపరిచారని, పవన్‌ను అవమనించడమంటే సామాజిక వర్గాన్ని తీవ్రంగా అవమానించినట్లేనని అన్నారు.

Read Also: Harirama Jogaiah: జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా?

కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని అత్యాశతో చంద్రబాబు గోరంగా పవన్ కళ్యాణ్ ను అవమాన పరుస్తున్నారని ఆరోపించారు. పవన్ కు రైట్లో నాదెండ్ల లెఫ్ట్ లో కందుల ఉండేవారిని, కందుల దుర్గేష్‌కే టిక్కెట్ లేకపోతె ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదని. వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పావలా కూడా చేయడనే అవమానం జరిగిందని ఆరోపించారు.చంద్రబాబు 95 సీట్లు ప్రకటించుకుంటే పవన్ ఐదు సీట్లు కూడా ప్రకటించుకోలేకపోయారని అన్నారు . ఇప్పటికే టీడీపీకి రాజ్యసభలో సున్న, రేపు పార్లమెంట్లోనూ అసెంబ్లీలో కూడా సున్నాయే అంటూ ఆరోపించారు.