టీడీపీ- జనసేన పొత్తులో టిక్కెట్ల కేటాయింపుపై రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- జనసేన పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత డొల్లతనం బయటపడిందని ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ కార్యదర్శి నారా లోకేష్‌లపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణు. లోకేష్ పాదయాత్ర లావు తగ్గడానికేననని ఆయన విమర్శించారు. లోకేష్‌ది క్యాట్ వాక్ అని, లోకేష్ పాదయాత్ర వద్దని ఆ పార్టీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పాడన్నారు. పాదయాత్రకే విలువలేదు, లోకేష్ రాసుకున్న ఎర్ర బుక్కు ఏం చేసుకుంటాడంటూ ఎద్దేవా చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సమగ్ర కులగణన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ కె.మాధవిలత అధ్యక్షత వహించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, పూర్వపు ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న 5 జిల్లాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు హాజరయ్యారు.