NTV Telugu Site icon

Minister Chelluboina Venu: 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు.. నేడు గజగజ వణికి పోతున్నాడు..

Chelluboina Venu

Chelluboina Venu

Minister Chelluboina Venu: టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ కార్యదర్శి నారా లోకేష్‌లపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణు. లోకేష్ పాదయాత్ర లావు తగ్గడానికేననని ఆయన విమర్శించారు. లోకేష్‌ది క్యాట్ వాక్ అని, లోకేష్ పాదయాత్ర వద్దని ఆ పార్టీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పాడన్నారు. పాదయాత్రకే విలువలేదు, లోకేష్ రాసుకున్న ఎర్ర బుక్కు ఏం చేసుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. గత పాలకులు ఇచ్చిన మాటలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయన్న మంత్రి చెల్లుబోయిన వేణు.. గతంలో సామాజిక న్యాయం అనేది ఎండమావి.. నేడు నిండు కుండ అని అన్నారు. గత పాలకులు ఎస్సీలను వివక్షతో చూశారన్నారు. గత పాలకులు అనేక వర్గాల పేదలను వివక్షతో చూశారని ఆయన మండిపడ్డారు. దళారులు లేకుండా పేదవారి గడపలకు సంక్షేమాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేర్చారని ఆయన చెప్పారు. పేదవారు మోసపోకుండా అవినీతి అనే పదానికి తావు లేకుండా.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారన్నారు. రూ. 2 లక్షల60 వేల కోట్లు నేరుగా పేదలకు ఖాతాలకు సీఎం చేర్చారన్నారు.

Read Also: Kakani Govardhan Reddy: అందుకోసమే సోమిరెడ్డి నిరసన చేస్తున్నారు.. మంత్రి కాకాని సంచలన వ్యాఖ్యలు

గతంలో పాలకులు ఐదేళ్ల తర్వాత హామీల గురించి ఆలోచించేవారని.. అధికారం చేపట్టిన మొదటి రోజు నుండే ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టిన నాయకుడు సీఎం జగన్‌ అంటూ మంత్రి పేర్కొన్నారు. పదవుల్లోనే కాదు ప్రజా అవసరాలను తీర్చడంలో సంక్షేమానికి పెద్దపీటవేశారన్నారు. అమలు చేసేవాడు మంచి వాడైతేనే పేదలకు మేలు జరుగుతుంది అన్న అంబేద్కర్ ఆశయాలను నిజం చేశారని చెప్పారు. పేదవాడికి విద్య అనేది పెద్ద ఆయుధం అని అంబేద్కర్ అన్నారని మంత్రి వెల్లడించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు నేడు గజగజగజ వణికి పోతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి ప్రజలను ఎలా మోసం చేయాలో అని ఆలోచిస్తున్నాడని.. ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. మోసానికి ఒక చిరునామా అబద్ధానికి ఒక చిరునామా వంచనకు ఒక చిరునామా చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. నైతిక విలువలు లేని నాయకుడు అధికారం కోసం ఎంత స్థాయికి అయిన దిగజారే వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. విలువలే పెట్టుబడిగా సత్యమేవ జయతే అన్న రీతిలో పాలన సాగిస్తున్న నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అంటూ పేర్కొన్నారు.

మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. ” గతంలో పిల్లలు బడిబాట పట్టేవారు కాదు గొప్ప సంస్కర్తగా పాలన నిర్ణయాలు తీసుకుని విద్యకు పెద్దపీద్ద వేశారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డ.. 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాడు సీఎం జగన్‌. కరోనాలో నువ్వు, నీ కొడుకు, నీ దత్తపుత్రుడు ఎక్కడున్నారు. సంస్కర్తకు సాధికారత యాత్ర ఒక సలాం కొడుతుంది. కష్టంలో ఉన్న ప్రజలకు సంరక్షించే సంస్కర్త సంస్కారిగా సంరక్షకుడుగా మారి ఈనాడు పాలన సాగిస్తున్నాడు. చంద్రబాబు హయాంలో పట్టిసీమ, పోలవరం, అమరావతి అంతా అవినీతి.. చంద్రబాబు ఏ స్కీం తీసుకున్న అంతా స్కామే. రూ. 2,60,000 కోట్లు పేదలకు పంచాడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.” అని మంత్రి తెలిపారు.