NTV Telugu Site icon

Minister Venugopalakrishna: గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకమైన సాహసం చేయలేదు..

Venugopalakrishna

Venugopalakrishna

Minister Venugopalakrishna: రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన ప్రక్రియ ప్రారంభించింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని నేలపర్తిపాడు గ్రామంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కులగణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకమైన సాహసం చేయలేదన్నారు. బీహార్‌లో కులగణన జరిగినా ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైందని. వివరించారు.కులగణన ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామన్నారు. గతంలో ఎంతోమంది కుల సంఘాల ప్రతినిధులు గత పాలకులను అడిగిన కులగణన చేపట్టలేదని.తెలిపారు. రాష్ట్రంలో అన్ని కులాల అభివృద్ధి కోసమే సమగ్ర కుల గణన చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారని అన్నారు.

Also Read: MLA Nimmala Ramanaidu Arrest: వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఆందోళన.. పాలకొల్లులో టెన్షన్‌ టెన్షన్‌

రామచంద్రాపురం మండలం నేలపర్తిపాడు లో పైలెట్ ప్రాజెక్టుగా కులగణన ప్రారంభించడంపై సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని. అన్నారు. స్వాతంత్రం రాకపూర్వం కుల గణన జరిగిందని, స్వాతంత్ర వచ్చిన తర్వాత జనాభా గణన జరిగింది, తప్ప కులగనన జరగలేదన్నారు. కుల గణన చేపట్టాలని ప్రయత్నాలు జరిగినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన జరగలేదన్నారు.బీసీ కులాల మనోవభావాలను పరిగణలోనికి తీసుకొని వారికి న్యాయం జరగాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మకమైన నిర్ణయంతో రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టుగా కులగననకు నాంది పలికారన్నారు.

Also Read: Balka Suman: చెన్నూరులో వివేక్ డబ్బులు పంచుతున్నారు.. బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు

సమాజంలో అగ్రకులాల వారితో సమానంగా బ్రతుకుతున్న వారితో పాటు కొన్ని కులాల వారికి సమాన గౌరవం దక్కటం లేదనే కారణంతో కులగననకు నాంది అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో అట్టడుగున ఉన్నవారికి కనీస అవసరాలు కల్పించి, వారు సుఖంగా జీవించాలని కోరుకున్నారన్నారు. అదేవిధంగా గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా గ్రామ స్వపరిపాలన ఉండాలని మహాత్మా గాంధీ ఆకాంక్షించారన్నారు. మహిళలు చదువుకోవాలని ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే -వారిని ఆదర్శంగా తీసుకొని మహిళలకు సముచిత గౌరవం దక్కే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని , రాష్ట్రంలో జరుగుతున్న పనితీరును మంత్రి వివరించారు. పేదరికంలో మగ్గుతున్న, పేదరికం శాపంగా భావిస్తున్న ఆయా వర్గాల్లో సమాన అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో కులగనలను చేపట్టడం అందులో భాగంగా రామచంద్రపురం నియోజవర్గం లోని నేలపార్తిపాడు గ్రామంలో చేపట్టడం బీసీ మంత్రిగా తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.