ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా జనం వెంటే ఉన్నారని మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వర రావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్లకు మాత్రమే మంచి చేసుకునేవారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.
చంద్రబాబు మోసగాడు, నిజం మాట్లాడని వ్యక్తి రైతును మోసం చేశాడు 87 వేల కోట్ల రుణాలు రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు.
రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన ప్రక్రియ ప్రారంభించింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని నేలపర్తిపాడు గ్రామంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కులగణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకమైన సాహసం చేయలేదన్నారు.