కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో గల్లి నుంచి జిల్లా పరిషత్ వరకు కాంగ్రెస్ నాయకులే ఉండాలే అన్నారు. నాగ మడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ను మా ఎమ్మెల్యే లక్ష్మి కాంతరావు ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని, ఇప్పటికే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. కుల గణన రావాలంటే…
రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన ప్రక్రియ ప్రారంభించింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని నేలపర్తిపాడు గ్రామంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కులగణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకమైన సాహసం చేయలేదన్నారు.