రాష్ట్రంలోని బీసీ మనసుల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అంటూ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. రాష్ట్రాలు కుల గణన చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.. అందులో భాగంగానే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం అని ఆయన పేర్కొన్నారు. దీనిపై కేంద్రం ఇంకా చర్యలు తీసుకోలేదు.. అందుకే రాష్ట్రం కుల గణన చేపడుతోంది అని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు.
Read Also: NewsClick Case : హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ప్రబీర్ పుర్కాయస్థ
ఇక, గోదావరి జిల్లాల్లో రోడ్లు తొందరగా పాడవుతూ ఉంటాయని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. గత ఏడాది ప్యాచ్ వర్క్ చేయించాం.. అయినా అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయి.. క్యాబినెట్ లో దశావతారాలు ఉన్నాయి.. నాది కల్కి అవతారం అని ఆయన పేర్కొన్నారు. అయితే, నిన్న ( మంగళవారం ) కాకినాడలో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో రోడ్లు, భవనాలశాఖపై చర్చ జరుగుతున్న సమయంలో.. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నమాట నిజమేనంటూ మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యనించారు. గతుకుల రోడ్డుతో తానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆయన చెప్పారు.
Read Also: Ghost : మూవీ ప్రమోషన్స్ లో పునీత్ ను తలుచుకొని ఎమోషనల్ అయిన శివన్న..
రోడ్డు బాగాలేని మాట వాస్తవమేనని.. వచ్చేప్పుడు, పోయేటప్పుడు నేను కూడా ఇబ్బంది పడుతున్నానని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. అయితే, రాష్ట్రంలో కొత్తగా రోడ్లు వేయాలంటే కోట్ల రూపాయలు కావాలని, ప్రతిపాదనల ఆమోదం, నిధుల మంజూరుకు టైం పడుతుందని మంత్రి చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు. ఈ లోపు మరమ్మతులు చేయాలని మంత్రి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. బీసీ కులగణనకు సీఎం జగన్ జీవో జారీ చేశారని మంత్రి వేణు వెల్లడించారు.