Minister Botsa Satyanarayana: మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ నేపథ్యంలో ఎన్ఐటీలలో చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు వచ్చేస్తామన్నారని.. ఈ విషయమై ముఖ్యమంత్రితో మేమంతా సంప్రదింపులు చేస్తూ.. రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తగు చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే హెల్ లైన్ ఏర్పాటు చేశామని.. ఎవ్వరున్నా తమకు సమాచారం ఇవ్వాలని మంత్రి సూచించారు. విద్యార్థులను అందరినీ వెనక్కి తీసుకొస్తామని.. తల్లిదండ్రులు అధైర్యపడొద్దని మంత్రి చెప్పారు. తొలుత 150 మందిని తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రత్యేక విమానాలను ఏర్పాట్లు చేయడం వల్ల ఆలస్యం జరుగుతోందని మంత్రి వెల్లడించారు.
Read Also: Alluri Sitarama Raju: అల్లూరి సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకోవాలి
వర్షాల కారణంగా పంట నష్టం పెద్దగా ఏమీ లేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పార్వతీపురంలో అరటి పంటకు కాస్త నష్టం జరిగిందన్నారు. మొక్కజొన్న రైతులు అక్కడక్కడా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారులు క్షేత్ర స్థాయిలో అంచనాలు వేస్తున్నారని మంత్రి తెలిపారు. చంద్రబాబు రైతులను పట్టించకోవడం లేదని చెబుతున్నారని.. ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా చూసుకుంటోందన్నారు. రైతుల ఆవేదన సీఎంవో దృష్టికి వచ్చిన వెంటనే సీఎం స్పందించారని.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు జిల్లాలకు వచ్చి పరిశీలిస్తున్నారని మంత్రి చెప్పారు.