Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Minister Botsa Satyanarayana Fires On Chandrababu And Pawan Kalyan

Botsa Satyanarayana: చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్.. ఆయనది నాలుకా, తాటిమట్టా…?

Published Date :April 6, 2023 , 2:41 pm
By Mahesh Jakki
Botsa Satyanarayana: చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్.. ఆయనది నాలుకా, తాటిమట్టా…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Botsa Satyanarayana: ఎంతసేపు సీఎం జగన్ పై నిందలు, విమర్శలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎవరి పనైపోయిందో వచ్చే ఎన్నికలే చెబుతాయన్నారు.

కొద్దో గొప్పో టీడీపీకి ఉన్న ఉనికి వచ్చే ఎన్నికల్లో పోవడం ఖాయమని బొత్స పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగింది నాటి సీఎం వైఎస్సార్ హయాంలోనే అన్నది టీడీపీకి తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఆ అభివృద్ధిని సీఎం జగన్ కొనసాగిస్తున్నారన్నారు. సీఎం జగన్‌పై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు. ఆయనది నాలుకా, తాటిమట్టా అంటూ మండిపడ్డారు. రుషికొండ బోడి కొండ చేశారని పదే పదే విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. అక్కడ ఏమైనా ప్రైవేట్ కట్టడాలు, లేదంటే తాము వ్యక్తిగత కట్టడాలు ఏమైనా చేస్తున్నామా.. ప్రభుత్వ కట్టడాలకే కదా ఉపయోగిస్తోంది…అభివృద్ధి చేయడం తప్పా.. అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేయాలి ఓటు అని ప్రశ్నలు గుప్పించారు. పేదవాడి ఆకలి మీద రాజకీయాలు చేసే చరిత్ర చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.

Also Read

  • Tamil Nadu: విజయ్‌తో టచ్‌లోకి అన్నాడీఎంకే..
  • End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?
  • MI Captain Hardik: వరుస వైఫల్యాలతో సతమతం.. ముంబై ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్ పాండ్యా..
  • Iran War: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..

Read Also: AP CM Jagan: స్కామ్‌లు తప్ప.. స్కీమ్‌లు తెలియవు.. ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ ఫైర్

దేశంలోనే అత్యధిక జీడీపీ పెరిగిన రాష్ట్రం ఏపీ అని.. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచిన ప్రభుత్వం మాది అంటూ బొత్స సత్యనారాయణ అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం… ఈ నాలుగు అంశాల్లో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా రాజీపడదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ నాలుగు అంశాలను అమలు చేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు పనైపోయిందని.. గ్రామాల్లోకి వెళ్లి ఓటు అడిగే ధైర్యం ఆయనకు ఉందా అంటూ బొత్స ఎద్దేవా చేశారు. జనసేన ఓ సెలెబ్రెటీ పార్టీ.. రాజకీయ పార్టీకి ఉండాల్సిన సిద్ధాంతాలు ఆ పార్టీకి లేవన్నారు. గత ఏడాది జరిగిన పరిణామాలతో …ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. పరీక్షలను కూడా రాజకీయాలకు వాడుకుందామనుకుంటే అంతకన్నా నీచమైన పని ఉండదన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • ap politics
  • chandrababu
  • Minister Botsa Satyanarayana
  • pawan kalyan

తాజావార్తలు

  • Tamil Nadu: విజయ్‌తో టచ్‌లోకి అన్నాడీఎంకే..

  • End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?

  • Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!

  • MI Captain Hardik: వరుస వైఫల్యాలతో సతమతం.. ముంబై ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్ పాండ్యా..

  • Tollywood : బీస్ట్ మోడ్‌లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions