Botsa Satyanarayana: గత కొన్ని రోజులుగా టీడీపీ పార్టీ నేతలు వైసీపీ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై అనేక అపోహలు ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న భూహక్కుదారులకు భూములపై హ మరింత బలం చేకూర్చే విధంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకువచ్చామన్నారు. భూ హక్కుదారుల మధ్య ఎమ్మార్వో లాంటి వాళ్ళు లేకుండా ప్రభుత్వం అండర్‌లో ఉండే విధంగా చూస్తామన్నారు. కొన్ని ఛానెళ్లపై యాక్షన్ తీసుకోవాలని ఉందన్నారు. జీరోస్ పేపర్ భూ హక్కుదారులు దగ్గర ఉంటాయని అంటున్నారని, అవన్నీ అబద్ధపు మాటలన్నారు. ల్యాండ్ టైటిలింగ్ అమలు చేస్తే భూహక్కుదారులు భూములను ఈజీగా అమ్ముకోవచ్చన్నారు. 2019లో ఇచ్చిన మేనిఫెస్టో, 2024లో ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో దేశంలో ఓ కొత్త ఒరవడి తీసుకు వచ్చిందన్నారు.
2019 ఎన్నికల్లో జగన్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోని టీడీపీ ప్రభుత్వం కాపీ కొట్టిందని విమర్శించారు. మీ కూటమి పార్టీలే మీ హామీలను అంగీకరించలేదు, ఇంకా రాష్ట్ర ప్రజలు ఎందును అంగీకరించాలో చెప్పాలన్నారు. కూటమి మేనిఫెస్టోలో పేపర్స్‌పై మోడీ ఫోటో ఎందుకు ప్రింట్ చెయ్యలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భూములు ఒరిజినల్ పేపర్స్ తీసుకొని జిరాక్స్ పేపర్స్ ఇస్తాం అని చెప్పడం దారుణమన్నారు.