YSRCP: ఈనెల 26 నుంచి ఉత్తరాంధ్రలో మొదటి దశ బస్సు యాత్రకు వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుట్టనుంది. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 13రోజుల పాటు ఉత్తరాంధ్రలో సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఏ విధంగా అవసరమో ప్రజలకు వివరిస్తామన్నారు. జగన్ మళ్లీ ఎందుకు రావాలో ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాలు తిప్పికొడతామన్నారు.
సామాజిక, రాజకీయంగా నాలుగున్నరేళ్లలో వివిధ వర్గాలకు లభించిన సముచిత స్థానం ప్రజలకు చెప్పబోతున్నామన్నారు. మా పార్టీ విధానం మూడు రాజధానులు సాంకేతిక కారణాలతో ఆలస్యం అయ్యిందన్నారు. సాధ్యమైనంత త్వరితగతిన రావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామన్నారు. త్వరలో విశాఖ నుంచి సమీక్షలు సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు. చంద్రబాబుకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని.. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని న్యాయస్థానం ఆదేశిస్తే అమలు చేస్తామన్నారు.
Also Read: Sajjala Ramakrishna Reddy: టీడీపీ నాయకులు మరో కొత్త డ్రామాకు తెర లేపారు..
మాజీమంత్రి గంటాకు కౌంటర్
మాజీమంత్రి గంటాకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ మనుగడకు ఈ నాలుగు నెలలు ఆఖరి రోజులు అవుతాయని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు తన మాటగా చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రలో పుట్టి ఉంటే రాజధాని అవసరం ఏంటో తెలిసి వుండేదన్నారు. స్థానికేతరలకు ఇక్కడ బాధలు ఏమి తెలుస్థాయని ఆయన అన్నారు. రాజధాని వస్తే దోపిడీ కుదరదని అనుకుంటున్నారా అంటూ మంత్రి ప్రశ్నించారు.
జనసేనకు కౌంటర్ ఇచ్చిన బొత్స…
జనసేనకు కూడా మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సీఎం చేసిన వ్యాఖ్యలపై జనసీన అనవసరంగా తడుముకుంటోందన్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నీ వాస్తవాలే చెప్పారని మంత్రి వెల్లడించారు. రాజకీయ జీవితంలో ఉన్న వాళ్ళు ఆదర్శంగా వ్యవహరించాలన్నారు.
లోకేష్ ఢీల్లీ టూర్‌పై బొత్స కామెంట్స్…
ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసినా, బాద్ షాను కలిసిన మాకేమీ అభ్యంతరం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తప్పు చేశారని న్యాయస్థానం నమ్మినందునే జైలుకు పంపించిందన్నారు. కక్షపూరిత చర్యగా లోకేష్ చేస్తున్న ఆరోపణలపై కేంద్ర విచారణ చేసుకుంటుందన్నారు. అమిత్ షా, అమితాబ్ బచ్చన్ ఎవరికి చెప్పినా మేం నిబంధనలు, ఆధారాలు ఆధారంగానే చర్యలు తీసుకున్నామన్నారు.