BC Janardhan Reddy: బనగానపల్లెలో మొహర్రం వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నవాబు వారసులైన మీర్ ఫజల్ అలీ ఖాన్ లు పాల్గొన్నారు. పట్టణంలోని ఆస్థానాలో హజరత్ అబ్బాస్ ఆలీ బంగారు పీర్లను కొలువుతీర్చారు. ఈ సందర్భంగా మంత్రి పూల షేర దట్టిని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ..
Read Also:Bengaluru: రీల్స్ చేస్తుండగా ప్రమాదం.. 13వ అంతస్తు నుంచి పడి యువతి మృతి
మొహర్రం వేడుకల కోసం జిల్లా మైనార్టీ శాఖ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ వేడుకలు దేశంలో ముంబై తర్వాత బనగానపల్లెలోనే అత్యంత ఘనంగా జరుపుకుంటారు అని చెప్పారు. ప్రతి ఏటా మొహర్రం సందర్భంగా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మత సామరస్యం, సమానతకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలను ప్రభుత్వ సహకారంతో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. బనగానపల్లెలో మొహర్రం వేడుకలు ప్రారంభమైన దృష్ట్యా స్థానికులు భారీగా హాజరయ్యారు. మతసామరస్యానికి నిదర్శనంగా ఈ వేడుకలు జరగడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Karnataka: దారుణం.. వన్యప్రాణులపై విషప్రయోగం.. 5 పులులు మృతి