Site icon NTV Telugu

Minister Atchannaidu: ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మేయాలి.. మంత్రి అచ్చెన్న వివాదాస్పద వ్యాఖ్యలు!

Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu

Minister Atchannaidu controversial comments on Super Six scheme: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. సూపర్ సిక్స్ సహా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో సమయం చూసి మరీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో ఓ పథకంను అమలు చేయడానికి ఆంధ్రానే అమ్మేయాలి అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు అచ్చెన్న తన వివాస్పద వ్యాఖ్యలతో సీఎం చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు.

Also Read: RK Roja: గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారు.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు!

కొత్తవలస మంగళపాలెంలో టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘సూపర్ సిక్స్ అన్నీ ఇచ్చేశాం. కేవలం మహిళలకు రూ.1500 రూపాయలు ఒక్కటే ఇవ్వాల్సి ఉంది. ఈ పథకం ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాల్సిందే. అందుకు ఆలోచిస్తున్నాం. రాష్ట్ర ఆధాయం కేవలం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే రావడం లేదు. ఈ నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. కానీ జిల్లాకే పరిమితం చేస్తామన్నారు. నారా లోకేష్ గారితో మాట్లాడాను. రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని లోకేష్ బాబు చెప్పారు. ఆరు బస్సులలో రాష్ట్రమంతా ప్రయానించొచ్చు. ఆటో డ్రైవర్‌లు వచ్చి తమకు సాయం చేయాలని కోరారు. వాళ్లనీ మేం ఆదుకుంటాము’ అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Exit mobile version