Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేసి, వివరాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలపై క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని మంత్రి సూచించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు వెంటనే పొలాలను సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యంగా నీరు నిలిచిన పొలాల్లో పంటలను రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని వీలైనంత త్వరగా తొలగించాలని, అధిక తేమ కారణంగా పంటలకు మరింత నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. రైతులకు పంటల రక్షణకు సంబంధించిన సాంకేతిక సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టాలకు సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రి సూచించారు. అదే సమయంలో వర్షపు నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, భవిష్యత్ సాగు అవసరాలకు వర్షపు నీటిని సమర్థంగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అందుబాటులో ఉండి రైతులకు అవసరమైన సహాయం, సాంకేతిక మార్గదర్శకాలు అందించాలని సూచించారు.
Also Read
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Pawan Kalyan - Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!